Begin typing your search above and press return to search.

ఈ యంగ్ హీరో కూడా గ్యాంగ్‌ స్ట‌ర్ బాట‌

జవాన్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో వరుణ్ ధావన్ యాక్షన్ హీరోగా క‌నిపించ‌నున్నారు. 'బేబీ జాన్' అనేది టైటిల్.

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:00 AM GMT
ఈ యంగ్ హీరో కూడా గ్యాంగ్‌ స్ట‌ర్ బాట‌
X

గ్యాంగ్ స్ట‌ర్లు, మాఫియా డాన్ లు, గూఢ‌చారులు, కాంతార‌లు ఏల్తున్న రోజులివి. ఏదైనా వైవిధ్య‌మైన కంటెంట్ ఆడియెన్ ని థియేట‌ర్ల వైపు ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన కేజీఎఫ్ ఫ్రాంఛైజీ సినిమాలు, స‌లార్ లో గ్యాంగ్ స్ట‌ర్లు హీరోలుగా ప్ర‌ధాన పాత్ర‌ల్లో అల‌రించారు. అందుకు భిన్నంగా ఒక ప్రాంతం సంస్కృతి సాంప్ర‌దాయం దైవం నేప‌థ్యంలో వ‌చ్చిన కాంతార కూడా ప్ర‌జ‌ల్ని మెప్పించింది. వీట‌న్నిటికీ సీక్వెల్ సినిమాలు ఇప్పుడు రూపొందుతున్నాయి. స‌లార్ 2, కాంత‌ర 2 సెట్స్ కెళుతున్నాయి.

అలాగే పై సినిమాల స్ఫూర్తితో ప‌ఠాన్ లాంటి గూఢ‌చారి కంటెంట్ తో షారూఖ్ ఖాన్ కూడా మెప్పించాడు. ఆ త‌ర్వాత యానిమ‌ల్ తో ర‌ణ‌బీర్ క‌పూర్ మాఫియా డాన్ అవ‌తారం ఎత్తాడు. ఇది కూడా గ్రాండ్ స‌క్సెస్. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మ‌రో యువ‌హీరో కూడా ఇదే బాట‌ను అనుస‌రిస్తున్నాడు. జవాన్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో వరుణ్ ధావన్ యాక్షన్ హీరోగా క‌నిపించ‌నున్నారు. 'బేబీ జాన్' అనేది టైటిల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ వీడియోలో వరుణ్ ధావన్ అవతార్ అత‌డి స్టైల్ చూస్తే ఈసారి కెరీర్ లో డిఫ‌రెంటుగా ట్రై చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో వరుణ్‌తో పాటు కీర్తి సురేష్, వామికా గబ్బి కూడా కనిపించనున్నారు. బాలీవుడ్ , సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తార‌ల‌తో ఈ కాంబినేషన్ చూస్తుంటే.. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ప్రేక్షకులకు క‌నెక్ట‌వ్వాల‌న్న త‌ప‌న కనిపించింది.

వరుణ్ ధావన్ చాలా కాలం తర్వాత బేబీ జాన్ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ వీడియోలో అతని స్టైల్ యాక్ష‌న్ అవ‌తారం క్రూరంగా క‌నిపిస్తోంది. టైటిల్‌ను ప్రకటిస్తూ షేర్ చేసిన వీడియోలో పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ధావ‌న్ బోయ్ హై-ఆక్టేన్ యాక్షన్ తో అద‌ర‌గొడుతున్నాడు. అతను చేతిలో పక్షిని పట్టుకుని సింహాసనంపై కూర్చొని క్రూరంగా చూస్తూ, మరుసటి క్షణం బుల్లెట్లు పేల్చే వాడిగా క‌నిపించాడు. అయితే ఇదే విజువ‌ల్ లో కాంత‌ర షేడ్స్ ని ఎలివేట్ చేస్తూ క‌థ‌క‌ళిని ప్ర‌ద‌ర్శించ‌డం కూడా క‌నిపిస్తోంది. జవాన్ బంపర్ సక్సెస్ తర్వాత అట్లీ, వరుణ్ ధావన్ ల క‌ల‌యిక‌లోని ఈ సినిమా గురించి చాలా క్యూరియాసిటీ నెల‌కొంది.

అట్లీ భార్య ప్రియా అట్లీ VD18 పేరును 'బేబీ జాన్' అని ప్రకటిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బేబీ జాన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలో విడుదల చేస్తాం! అని క్యాప్షన్‌లో రాసారు. అట్లీ సమర్ప‌ణ‌లో దర్శకుడు ఎ. కాళీశ్వరన్ - మురాద్ ఖేతాని, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్, అట్లీస్ ఎ ఫర్ యాపిల్ స్టూడియోస్ , సినీ1 స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెర‌కెక్కింది.