Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్‌ ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ కి ఎన్నికల దెబ్బ...!

కానీ మంచి ఆఫర్ కోసం ఈ అమ్మడు ఎదురు చూసి ఇటీవలే వరుణ్‌ దావన్‌ కి జోడీగా బేబీ జాన్‌ అనే సినిమాలో నటించింది.

By:  Tupaki Desk   |   17 April 2024 4:42 AM GMT
కీర్తి సురేష్‌ ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ కి ఎన్నికల దెబ్బ...!
X

తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యి, ఆ తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సౌత్ లో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌ 'మహానటి' సినిమాతో హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించిన విషయం తెల్సిందే.


అప్పటి నుంచే కీర్తి సురేష్‌ కి హిందీ నుంచి హీరోయిన్‌ ఆఫర్లు వచ్చాయి. కానీ మంచి ఆఫర్ కోసం ఈ అమ్మడు ఎదురు చూసి ఇటీవలే వరుణ్‌ దావన్‌ కి జోడీగా బేబీ జాన్‌ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేశారు. మే 31న సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం 'బేబీ జాన్‌' సినిమా ముందుగా ప్రకటించిన తేదీకి రావడం లేదు. ప్రీ ప్రొడక్షన్‌ ఆలస్యం అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కొందరు మాత్రం దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఇలాంటి సమయంలో సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవచ్చు అనే ఉద్దేశ్యంతో వాయిదా వేసి ఉంటారు అనే ప్రచారం చేస్తున్నారు.

ఏది ఏమైనా కీర్తి సురేష్ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి ప్రాజెక్ట్‌ ఇలా ఎన్నికల వల్ల లేదా మరేదో కారణం వల్ల ఆలస్యం అవ్వడం ఆమె ఫ్యాన్స్ కి కాస్త నిరుత్సాహం ను కలిగిస్తుంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్‌ బాబీ జాన్ తో డైరెక్ట్‌ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

సినిమా విడుదల ఎలాగూ ఆలస్యం కానుంది కనుక పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ పై మరింత శ్రద్ద పెట్టే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం జులై రెండో వారంలో బేబీ జాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుణ్ దావన్‌ మరియు కీర్తి సురేష్ ల జోడీ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే జులై వరకు వెయిట్‌ చేయాల్సిందే.