Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో దూసుకుపోతున్న బేబీ హీరో మూవీ

తరువాత అనసూయతో కలిపి థాంక్యూ బ్రదర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 1:22 PM GMT
ట్రెండింగ్ లో దూసుకుపోతున్న బేబీ హీరో మూవీ
X

బేబీ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ ఇప్పటికే వరుస మూవీస్ చేస్తూ బిజీ అవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించాడు. అలాగే హీరోగా తన ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాడు. అతను అనగనగా ఒక ప్రేమ కథ సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు. తరువాత అనసూయతో కలిపి థాంక్యూ బ్రదర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు.


ఈ మూవీ పర్వాలేదని టాక్ తెచ్చుకుంది. మాయాపేటిక అనే మూవీలో కూడా లీడ్ రోల్ లో కనిపించాడు. అయితే బేబీ మూవీ అతనికి గుర్తింపు తీసుకొచ్చింది. దానితర్వాత జోరుగా హుసారుగా అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీ థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగమ్మాయి పూజిత పొన్నాడ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మంచి యాక్టర్ గా పూజిత గుర్తింపు తెచ్చుకుంది. అయితే గుర్తింపు తీసుకొచ్చే పెద్ద సినిమాలు ఆమెకి పడటం లేదు. కానీ ఓటీటీలో మాత్రం పూజితకి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఉండటం విశేషం. ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్, గౌతమి చల్లగుళ్ళ దర్శకత్వం వహించారు. సాయి కుమార్, రోహిణి, మధునందన్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ కూడా మూవీలో కీలక పాత్రలలో నటించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతూ ఉండటం విశేషం.

థియేటర్స్ లో రాని సక్సెస్ ఈ బేబీ హీరోకి ఓటీటీలో వస్తూ ఉండటం విశేషం. విరాజ్ అశ్విన్ నటించిన మాయాపేటిక మూవీకి కూడా ఓటీటీలో మంచి ఆదరణ లభించడం విశేషం. ఒక్కో మూవీతో క్రేజ్ పెంచుకుంటున్న విరాజ్ అశ్విన్ ఈ జెనరేషన్ కి రొమాంటిక్ హీరోగా మారుతాడేమో చూడాలి.

https://www.primevideo.com/region/eu/detail/0KTJQK8F15HM5K50GDZN765DPY