Begin typing your search above and press return to search.

హిందీ 'బేబీ' క్లారిటీ వచ్చేసిందోచ్‌...!

ఆనంద్ దేవరకొండ, విరాజ్‌, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:24 AM GMT
హిందీ బేబీ క్లారిటీ వచ్చేసిందోచ్‌...!
X

ఆనంద్ దేవరకొండ, విరాజ్‌, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా తెల్సిందే. దాదాపుగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న 'బేబీ' ని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్నట్లుగా నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

బేబీ వచ్చి చాలా రోజులు అయింది, రీమేక్ ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయింది. ఇప్పటి వరకు ఎప్పుడు రీమేక్ పనులు మొదలు అయ్యేది క్లారిటీ లేకపోవడంతో అసలు రీమేక్ ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్ బేబీ రీమేక్ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హిందీలో బేబీ రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బేబీ సినిమా యొక్క రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. గ్రాండ్ గా బేబీ ని హిందీలో రీమేక్ చేసేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా నిర్మాత ఎస్‌కేఎన్‌ పేర్కొన్నాడు.

ఇక హిందీ 'బేబీ' లో కొత్త నటీ నటులు కాకుండా ఇప్పటికే పలు సినిమా ల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటీ నటులను నటింపజేసేందుకు సదరు నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతున్నట్లుగా కూడా ఎస్‌కేఎన్‌ తెలియజేశాడు.

వచ్చే ఏడాది ఆరంభంలోనే హిందీ బేబీని పట్టాలెక్కించి అదే ఏడాది లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా బేబీ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయట. హిందీ బేబీకి దర్శకుడు ఎవరు అనేది, నటీ నటులు, నిర్మాణ సంస్థ ఏది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.