Begin typing your search above and press return to search.

బేబీ బాక్సాఫీస్.. 3వ రోజు టార్గెట్ ఫినిష్

మొదటి రోజు కంటే రెండో కాస్త ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న బేబీ సినిమా మూడవ రోజు మాత్రం అంతకుమించి అనేలా నెంబర్లు పెంచుకుంది.

By:  Tupaki Desk   |   17 July 2023 6:38 AM GMT
బేబీ బాక్సాఫీస్.. 3వ రోజు టార్గెట్ ఫినిష్
X

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దని రికార్డు స్థాయి లో కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా లో విరాజ్ అశ్విన్ అనే కొత్త నటుడు కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక బాక్సాఫీస్ వద్ద రోజు రోజు కు ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఊహించిన విధంగానే పెరుగుతూ ఉన్నాయి.

మొదటి రోజు కంటే రెండో కాస్త ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న బేబీ సినిమా మూడవ రోజు మాత్రం అంతకుమించి అనేలా నెంబర్లు పెంచుకుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మొదటి రోజు బేబీ సినిమా కు 2.60 కోట్ల షేర్ రాగా రెండవ రోజు 2.98 కోట్ల షేర్ వచ్చింది. ఇక మూడవరోజు అంతకుమించి అనేలా 3.7 కోట్ల షేర్ రావడం విశేషం.

మొదటి రెండు రోజుల నెంబర్స్ కంటే కూడా మూడవ రోజు (ఆదివారం) ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో ఈ సినిమా టార్గెట్ ను కూడా పూర్తి చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మూడు రోజుల్లో బేబీ సినిమా 9.33 కోట్ల షేర్ 16.30 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అక్కడ 77 లక్షల గ్రాస్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా నెంబర్స్ పెరగడంతో ఇప్పటివరకు మొత్తంగా అటు వైపు నుంచి 1.55 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బేబీ సినిమా మూడు రోజుల్లో 14.33 కోట్ల షేర్ కలెక్షన్స్ 23.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

బేబీ సినిమా మార్కెట్లో ఓవరాల్ గా 7.40 కోట్ల రేట్లు బిజినెస్ చేయగా బాక్సాఫీస్ టార్గెట్ 8 కోట్లకు సెట్ అయింది.

ఇక సినిమా మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన షేర్ 12.33 కోట్లు. అంటే సినిమా అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసింది. అంతేకాకుండా 4 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తో కూడా కొనసాగుతోంది. ఆదివారం కావడం తో కలెక్షన్స్ అయితే ఒక్కసారిగా పెరిగాయి. ఇక సోమవారం నుంచి ఈ సినిమా కు అసలు పరీక్ష మొదలుకానుంది. మరి బేబీ ఈ వీకెండ్ అనంతరం ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.