Begin typing your search above and press return to search.

దేవరకొండ హిట్ హీరోయిన్ సెంటిమెంట్!

అయితే తాజాగా మరల బేబీలో తనకి జోడీగా చేసిన ఆనంద్ దేవరకొండ తోనే మరో సినిమాకి వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 3:55 AM GMT
దేవరకొండ హిట్ హీరోయిన్ సెంటిమెంట్!
X

బేబీ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వైష్ణవి చైతన్య. ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద బ్యానర్స్ వైష్ణవితో మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఆమెతో కొన్ని నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బేబీ చిత్రం తర్వాత స్టార్ హీరోలతో వైష్ణవి నటిస్తుందని అందరూ భావించారు. కాని ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఎనౌన్స్ కాలేదు.

అయితే తాజాగా మరల బేబీలో తనకి జోడీగా చేసిన ఆనంద్ దేవరకొండ తోనే మరో సినిమాకి వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉందంట. డ్యూయెట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంతో మిథున్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బేబీ తరహాలో కాకున్న ప్యూర్ లవ్ స్టొరీతోనే ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందంట. ఈ కారణంగా చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలించారు. అయితే ఎవరు సెట్ కాలేదంట. దీంతో దర్శకుడు ఫైనల్ గా వైష్ణవి చైతన్యకి స్టొరీ చెప్పడం, ఆమె కూడా ఒప్పుకోవడం జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. వైష్ణవికి కథ భాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందంట. ఆనంద్ దేవరకొండ కూడా బేబీ తర్వాత మరల లవ్ స్టొరీతో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.

బేబీలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ జోడీ అందరికి కనెక్ట్ అయ్యింది. అందుకే డ్యూయెట్ లో కూడా మరోసారి ఆనంద్, వైష్ణవి కాంబినేషన్ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. దసరాకి ఈ సినిమా ఎనౌన్స్మేంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

అదే రోజు ఓపెనింగ్ కూడా జరగబోతోందని తెలుస్తోంది. కంప్లీట్ యూత్ ఫుల్ లవ్ స్టొరీగానే దీనిని దర్శకుడు ఆవిష్కరించబోతున్నాడని సమాచారం. మరి బేబీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ డ్యూయెట్ మూవీ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారు అనేది వేచి చూడాలి.