Begin typing your search above and press return to search.

బేబీకి నేషనల్ అవార్డ్స్.. వైష్ణవితో విభేదాలపై టీం క్లారిటీ!

అలాంటి ఈ సినిమాకి ఇటీవల 2 నేషనల్ అవార్డ్స్ లభించాయి. తాజాగా ఆగస్టు 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ జాబితాను ప్రకటించింది.

By:  Tupaki Desk   |   3 Aug 2025 11:13 PM IST
బేబీకి నేషనల్ అవార్డ్స్.. వైష్ణవితో విభేదాలపై టీం క్లారిటీ!
X

బేబీ.. రొమాంటిక్ డ్రామా చిత్రంగా 2023 జూలై 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చినా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. యువతలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. యూట్యూబర్ వైష్ణవి చైతన్య, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు 2023లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా చాలామంది యువతకు కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.

అలాంటి ఈ సినిమాకి ఇటీవల 2 నేషనల్ అవార్డ్స్ లభించాయి. తాజాగా ఆగస్టు 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ జాబితాను ప్రకటించింది. బెస్ట్ స్క్రీన్ ప్లేయర్ రైటర్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరిలో రెండు నేషనల్ అవార్డ్స్ లభించాయి. ఈ సందర్భంగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ తో పాటు ఆనంద్, వైష్ణవి కూడా సందడి చేశారు. అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడడంతో మీడియా వాళ్ళు పాత విషయాలను గుర్తు చేసి, మళ్లీ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయితే మీడియా వాళ్ళు అలా చేసినా అసలు విషయంపై క్లారిటీ వచ్చింది అని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్షన్లో ఎస్ కే ఎన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ - వైష్ణవి జంటగా ఎస్కేఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ స్క్రిప్ట్ తో మరో సినిమాను ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి ఆనంద్ - వైష్ణవి తప్పుకున్నారు. ఆ స్థానంలోకి కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ వచ్చారు. అటు పోస్టర్ కూడా తెరపైకి వచ్చింది. దీంతో వైష్ణవి చైతన్య, సాయి రాజేష్, ఆనంద్ ఎస్కేఎన్ ల మధ్య ఏదో జరిగిందంటూ పెద్ద ప్రచారం జరిగింది. దీనికి తోడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదు అంటూ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్లు వైష్ణవిని ఉద్దేశించేనా అంటూ చాలామంది వార్తలు వైరల్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఎస్కేఎన్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగిపోలేదు. కానీ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ వచ్చిన వేళా విశేషం.. ప్రెస్ మీట్ పెట్టడంతో అందులో పాల్గొన్న వీరంతా ఒకే చోట కనిపించి అసలు రూమర్స్ కి చెక్ పెట్టారు. ఏది ఏమైనా గతంలో వచ్చినవన్నీ రూమర్స్ అని.. వివిధ కారణాల వల్ల సినిమా నుండి వారు తప్పుకున్నారేమో కానీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెక్ పెట్టింది చిత్ర బృందం.