Begin typing your search above and press return to search.

చిరంజీవినే వెయిట్ చేయించిన క‌మెడియ‌న్!

అదే న‌టుడు చిరంజీవిని మూడు నెల‌లు వెయిట్ చేయించాడుట‌. అప్ప‌ట్లో బాబా మోహ‌న్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 March 2024 11:30 AM GMT
చిరంజీవినే  వెయిట్ చేయించిన క‌మెడియ‌న్!
X

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ కి ఎంత మంది హీరోలొచ్చినా ..ఎంత మంది స్టార్లు ఉన్నా? ఆయ‌న స్థానం మాత్రం ఎప్ప‌టికి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌రిత్ర సృష్టించిన ఓ లెజెండ‌రీ న‌టుడు. మ‌రి అలాంటి లెజెండ‌రీ నటుడ్నే ఓ క‌మెడియ‌న్ వెయిట్ చేయించాడు అంటే న‌మ్ముతారా? అంటే న‌మ్మాల్సిందే. ఎవ‌రైనా చిరంజీవి కోసం వెయిట్ చేస్తారు త‌ప్ప చిరంజీవి వెయిట్ చేయ‌డం ఏంటి? అని వెంట‌నే ఓ సందేహం వ‌చ్చేస్తుంది.

కానీ అన్ని వేళ‌లా అలా కుద‌ర‌దుగా. అలా 'ముఠా మేస్త్రీ' సినిమాలో అలాంటి స‌న్నివేశం ఒక‌టి చేటు చేసుకుంది. చిరంజీవి హీరోగా న‌టించిన ఆ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. అందులో క‌మెడియ‌న్ బాబు మోహ‌న్ పాత్ర కూడా అంతే గొప్ప‌గా పండుతుంది. అదే న‌టుడు చిరంజీవిని మూడు నెల‌లు వెయిట్ చేయించాడుట‌. అప్ప‌ట్లో బాబా మోహ‌న్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడంటే సినిమాలు చేయ‌లేదు గానీ అప్ప‌ట్లో బాబు మోహ‌న్ అంటేనే మార్కెట్లో బ్రాండ్. ఆయ‌న కామెడీ చూడ‌టం కోసమే ప్ర‌త్యేకంగా థియేట‌ర్ కి వెళ్లే అభిమానులుండేవారు. ముద్దుగా పాయ అంటూ పిల‌చుకో వ‌డం అప్ప‌టి అభిమానుల‌కు అల‌వాటు. అయితే ముఠామేస్త్రీ స‌మ‌యంలో బాబు వ‌రుస‌గా సినిమా షూటింగ్ ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉండేవారుట‌. ఒకేసారి ఐదారు సినిమా సెట్స్ కు రోజులో హాజ‌ర‌య్యే వారుట‌.

దీంతో ముఠామేస్త్రీకి డేట్లు కేటాయించ‌డం ఆల‌స్య‌మైంద‌ని...ఆ కారణంగా చిరంజీవి ఆయ‌న కోసం ఏకంగా మూడు నెల‌లు పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చిందిట‌. అదే స‌మ‌యంలో డ‌బ్బులు మంచ‌కింద పెట్టి మ‌ర్చిపోయేవారుట‌. ఓ సారి ప‌రుపు దులిపితే ఏకంగా 12 ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌య‌ట ప‌డ్డాయ‌ని తెలిపారు. అవి ఎప్పుడు పెట్టాడో త‌న‌కి గుర్తు లేద‌ని..అప్ప‌టి త‌న బిజీ అలా ఉండేద‌ని తెలిపారు.