Begin typing your search above and press return to search.

'బేబీ' హిందీ రీమేక్.. తప్పుకున్న హీరో?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఆ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు

By:  Tupaki Desk   |   18 May 2025 1:54 PM IST
బేబీ హిందీ రీమేక్.. తప్పుకున్న హీరో?
X

తెలుగు రొమాంటిక్ డ్రామా బేబీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఆ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేసిన బేబీ మూవీ.. మంచి వసూళ్లు అందుకుని ఓ రేంజ్ లో అదరగొట్టింది.

ఆ తర్వాత బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు సాయి రాజేష్. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు గానీ.. బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జరుగుతోంది. ప్రముఖ వెర్సటైల్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ గా మూవీ స్టార్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు బాబిల్ ఖాన్ బేబీ హిందీ రీమేక్ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ తో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకున్నానని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు అది పాజిబుల్ కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం తాను బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయి రాజేష్ అండ్ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు.

ఆ తర్వాత సాయి రాజేష్ పై ఉన్న తన ప్రేమను షేర్ చేసుకున్నారు. తమ మధ్య అపారమైన లవ్ ఉందని తెలిపారు. ఫ్యూచర్ లో కచ్చితంగా కలిసి పని చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాబిల్ ఖాన్ పోస్ట్ కు సాయి రాజేష్ రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో నోట్ విడుదల చేసి.. బాబిల్ ను మిస్ అవుతున్నట్లు తెలిపారు.

తాను ఇప్పటివరకు చూసిన.. కలిసిన టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో బాబిల్ ఖాన్ ఒకరని కొనియాడారు. కొంతకాలం పాటు ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. బాబిల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తప్పకుండా ఇంకోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తామని నోట్ లో పేర్కొన్నారు.

బాబిల్ ఖాన్ తప్పుకోవడంతో బేబీ హిందీ రీమేక్ కు పెద్ద బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు ఎవరిని సాయి రాజేష్ సెలెక్ట్ చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో బాబిల్ నిర్ణయానికి కారణమేంటో అన్నది అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో కొన్ని సిట్యుటేషన్స్ వల్ల తాను ఒత్తిడికి గురవుతున్నట్లు బాబిల్ ఇటీవల ఓ పోస్ట్ చేసి డిలీట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడికి కొద్ది రోజుల తర్వాత బాబిల్.. బేబీ మూవీ నుంచి తప్పుకోవడం గమనార్హం.