Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్ : థ్రిల్లర్ ప్లస్ కామెడీ 'బాక్‌'

తమిళ స్టార్‌ దర్శకుడు సుందరి సి దర్శకత్వంలో రూపొందిన అరణ్మణి 4 పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 April 2024 9:21 AM GMT
ట్రైలర్‌ టాక్ : థ్రిల్లర్ ప్లస్ కామెడీ బాక్‌
X

తమిళ స్టార్‌ దర్శకుడు సుందరి సి దర్శకత్వంలో రూపొందిన అరణ్మణి 4 పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు లో ఈ సినిమా ను 'బాక్‌' అనే టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజాగా 'బాక్‌' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల అయ్యింది. సుందర్ సి గత చిత్రాల మాధిరిగానే ఈ సినిమా కూడా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో పాటు హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్‌ తో రూపొందినట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం కామెడీ ట్రాక్ ను స్పెషల్‌ గా షూట్‌ చేసినట్లుగా ట్రైలర్‌ ను చూస్తే అర్థం అవుతోంది.

తమన్నా మరియు ఆమె భర్త సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో అనూహ్యంగా వారి జీవితంలో ఎదురైన సంఘటనలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సినిమాను రూపొందించారు. అడవిలో జరిగే వింత సంఘటనల వెనుక ఉన్నది ఏంటి అనేది తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే సినిమా కథాంశం.

తమన్నా తో పాటు ఈ సినిమాలో మరో తెలుగు హీరోయిన్ రాశి ఖన్నా కూడా నటించింది. దాంతో ఇది ఒక తెలుగు సినిమా అన్న ఫీల్ ను దర్శకుడు కలిగించాడు. అంతే కాకుండా కమెడియన్స్ వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డిలు భయపడుతూ నవ్వించబోతున్నారు.

ఈ మధ్య కాలంలో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కనుక కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు అటు తమిళనాట ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దెయ్యం పేరును బాక్‌ గా ఇందులో చెప్పడం జరిగింది. టైటిల్‌ తోనే దర్శకుడు సుందర్‌ సి అందరిని ఆశ్చర్యపరిచాడు. తమిళంలో అరణ్మణి అంటూ పెట్టి తెలుగు లో బాక్‌ అని పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది తెలియాలంటే మే 3న సినిమా విడుదల అవ్వబోతుంది.. అప్పటి వరకు వెయిట్‌ చేయాల్సిందే.