Begin typing your search above and press return to search.

బాహుబలి మేకర్స్‌ 'యక్షిణి' గురించి తెలుసా..!

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ భాగస్వామ్యంతో యక్షిణి అనే వెబ్‌ సిరీస్ ను మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   12 May 2024 2:30 PM GMT
బాహుబలి మేకర్స్‌ యక్షిణి గురించి తెలుసా..!
X

బుల్లితెర సీరియల్స్ తో పాటు బాహుబలి వంటి భారీ సినిమా ఫ్రాంచైజీని నిర్మించిన ఆర్కా మీడియా ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మించడంతో పాటు బ్యాక్ టు బ్యాక్‌ వెబ్ సిరీస్ ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. బాహుబలి తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న ఆర్కా మీడియా నిర్మాతలు ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచారు.

ఇప్పటికే ఆక్సీజన్ మరియు డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాలను ప్రకటించారు. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిజల్‌ ఈ సినిమాల్లో నటిస్తన్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు ఒక వైపు మేకింగ్‌ లో ఉండగానే మరో వైపు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ భాగస్వామ్యంతో యక్షిణి అనే వెబ్‌ సిరీస్ ను మొదలు పెట్టారు.

ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ మరియు హర్రర్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలకు మంచి స్పందన వస్తుంది. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌ ను ఆర్కా మీడియా వారు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదల అయిన ప్రీ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

జోహార్ మరియు కోటబొమ్మాళి పీఎస్ వంటి విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అభిరుచి ఉన్న దర్శకుడు అంటూ పేరు దక్కించుకున్న తేజ మార్ని ఈ వెబ్‌ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్‌ సిరీస్ ను కూడా అత్యంత ఆసక్తికరంగా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్ లో మంచు లక్ష్మి, వేదిక, రాహుల్‌ విజయ్‌, అజయ్ ఇంకా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ స్పీడ్ గా జరుగుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ప్రేక్షకుల ముందుకు ఈ వెబ్‌ సిరీస్‌ ను ఇదే ఏడాది చివరి వరకు తీసుకు వచ్చే విధంగా ఆర్కా మీడియా వారు ప్లాన్‌ చేస్తున్నారు.