Begin typing your search above and press return to search.

'కన్నప్ప'లో బాహుబలి కాంబో..

అయితే బాహుబలి లాంటి తారాగణంతో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 12:16 PM GMT
కన్నప్పలో బాహుబలి కాంబో..
X

రాజమౌళి తెరపైకి తీసుకువచ్చిన బిగ్గెస్ట్ మూవీ బాహుబలి లో స్టార్ క్యాస్ట్ అనేది ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో కదా కదనం మాత్రమే కాకుండా రాజమౌళి మేకింగ్ తో పాటు తారాగణం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా నటించి ఊహించని స్థాయిలో విజయాన్ని తెచ్చిపెట్టారు. అయితే బాహుబలి లాంటి తారాగణంతో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.


ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. మొదట అప్డేట్ అనగానే అంతగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్ట్ గురించి ఎప్పుడైతే మేకర్స్ ఒక్కొక్క విషయాన్ని తెలుపుతూ వచ్చారో అప్పుడు ఈ సినిమాకు పర్ఫెక్ట్ క్రేజ్ అయితే పెరుగుతూ ఉంది.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా క్లిక్ అయ్యే విధంగా మంచి విష్ణు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మలయాళం స్టార్ మోహన్ లాల్ తో పాటు నయనతార, కృతి సనోన్, శివరాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో కొన్ని కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

కేవలం స్టార్ క్యాస్ట్ తోనే ఈ సినిమాకు ఇప్పటివరకు ఊహించని స్థాయిలోనే బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక అసలైన ప్రమోషన్ కంటెంట్ తో క్రేజ్ ఇంకా ఏ స్థాయిలో పెంచుతారో అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ని కూడా శివుడి పాత్ర కోసం తీసుకున్నట్లుగా ఇటీవల కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి.

ఇక పార్వతీదేవి పాత్ర కోసం బాహుబలి దేవసేన రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఒకే చెప్పగా ఇప్పుడు అనుష్క కూడా స్టయితే బాహుబలి కాంబోలో సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. అనుష్క శెట్టి క్యారెక్టర్ నచ్చితే స్పెషల్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఇక కన్నప్ప లాంటి సినిమాలో ఇంతమంది తారకణం ఉన్నప్పుడు ఆమె అడిగితే నో చెప్పకుండా ఉండలేదు.

తప్పకుండా అనుష్క సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఆమె నిజంగా పార్వతి పాత్ర చేస్తుందా లేదంటే మరేదైనా పాత్రలో కనిపిస్తున్నారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. బ్రహ్మానందం మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి ప్రముఖ నటులకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. మోహన్ బాబు కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనుష్కతో 2006లో మంచు విష్ణు అస్త్రం అనే సినిమా చేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెతో ఈ సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.