ఇవన్నీ టాలీవుడ్ లో వచ్చిన కొత్త మార్పులే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చోటు చేసుకున్న మార్పులేంటి? మునుపటి చిత్రాలకు..ఇప్పుడొస్తున్న చిత్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది? అంటే చాలా సంగతులే కనిపిస్తున్నాయి.
By: Srikanth Kontham | 17 Feb 2026 9:31 AM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చోటు చేసుకున్న మార్పులేంటి? మునుపటి చిత్రాలకు..ఇప్పుడొస్తున్న చిత్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది? అంటే చాలా సంగతులే కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో కొత్త మార్పులు వచ్చాయన్నది కాదనలేని నిజం. ఎంతో అడ్వాన్స్ గా ఇండస్ట్రీ కనిపిస్తోంది. కొత్త కొత్త టెక్నాల జీలను అందిపుచ్చుకుంటోంది. నిర్మాతల్లోనూ కథలపై అవగాహన పెరిగింది. హీరోలు మరింత సెలక్టివ్ గా ఉంటున్నారు. ఇవన్నీ పక్కన బెట్టి ప్రధానంగా చోటు చేసుకున్న మార్పుల విషయానికి వస్తే...
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయిలో రీచ్ అవుతోంది. గతంలో తెలుగు సినిమాలు కేవలం సౌత్ ఇండియాకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు హిందీ మార్కెట్‌ను శాషిస్తున్నాయి. అంతే కాదు అమెరికా తో పాటు జపాన్, చైనా వంటి దేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నాయి. సీక్వెల్స్, ప్రాంచైజీల ట్రెండ్ కూడా టాలీవుడ్ లో విస్తృతంగా పెరిగింది. ఒకప్పుడు ఒక కథను ఒక భాగంలోనే చెప్పేవారు. కానీ ఇప్పుడు రెండు భాగాలుగా చెబుతు న్నారు. లేదా ఒకే కథను రెండు భాగాలుగా చీల్చుతున్నారు. ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్ తీయడం బలమైన ట్రెండ్ గానూ మారింది.
ఫలితాలు బాగుంటే ఎన్ని భాగాలైనా చేయడానికి మేకర్స్ సిద్దంగా ఉంటున్నారు. వాటిలో హీరోలు కూడా మారు తున్నారు. సాధారణంగా ఇలా హీరో మారడం అనే కల్చర్ బాలీవుడ్ ప్రాంచైజీల్లోనే కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో తెలుగు హీరోలు కూడా ఎంతో పాజిటివ్ గా ఉంటున్నారు. `హిట్` సిరీస్... `హనుమాన్` సిరీస్ ఇలా కొన్ని సినిమాలున్నాయి. మైథాలజీ కాన్సెప్ట్ లు పెరిగాయి. ఈ జానర్ కథలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. దీంతో మేకర్స్ కూడా వాటిపై ఆసక్తి చూపిస్తు న్నారు. ఇలాంటి కథలతో అప్రోచ్ అయిన కొత్త కుర్రాళ్లను హీరోలు అత సులభంగా వదులుకోవడం లేదు. వారిపై నమ్మకం కలిగితే? ధైర్యంగా సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు.
పురాణాలు , జానపద కథలకు ఆధునిక టెక్నాలజీని జోడించి సినిమాలు తీయడం మొదలైంది. `కల్కి` (మహాభారత నేపథ్యం), హనుమాన్ (మైథాలజీ), `విశ్వంభర` (సోషియో ఫాంటసీ) వంటి సినిమాలు దీనికి నిదర్శనం. అలాగే మేకింగ్ స్టైల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. పాత పద్దతులకు స్వస్తి పలికి కంటెంట్ ఈజ్ కింగ్ లా హైలైట్ చేస్తున్నారు. క్రిస్పీగా కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేకింగ్ ఎంతో సరళంగానూ ఉంటుంది. ఓ పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అయిపో తుందని నిర్మాతలు భావించడం లేదు. షార్ట్ అండ్ స్వీట్ గా కథల్ని హైలైట్ చేస్తున్నారు. ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ తగ్గడంతో, అనవసరమైన సాగతీత సీన్లు లేకుండా కథను వేగంగా నడిపిస్తున్నారు.
తక్కువ బడ్జెట్ లో కంటెంట్ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఓటీటీ అండ్ థియేట్రికల్ విండో లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి కంటెంట్ అయితే బాగుంటుందో తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు.తెలుగు సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోతో సినిమా తీయా లంటే 150 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే సినిమాల్లో విజువల్ ఎఫెక్స్ట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను మన సినిమాల్లో చూపిస్తున్నారు.
