అది రాజమౌళికి మాత్రమే తెలుసు
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగడంతో పాటూ వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
By: Tupaki Desk | 16 July 2025 10:57 AM ISTటాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగడంతో పాటూ వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. కొత్తగా థియేటర్లలో రిలీజైన సినిమాలు ఓపెనింగ్స్ కోసం నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో రీరిలీజులకు మాత్రం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ట్రెండ్ లో భాగంగానే ఇండియన్ సినిమా ప్రైడ్ గా చెప్పుకునే బాహుబలిని రీరిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బాహుబలి1 రిలీజై రీసెంట్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలిని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండు భాగాలుగా రిలీజైన బాహుబలిని మొత్తం కలిపి రీమాస్టర్ చేసి స్పెషల్ వెర్షన్ ను బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్‌తో అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి1 రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు కాగా, బాహుబలి2 రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాలు. ఈ రెండింటినీ కలిపితే 5 గంటలకు పైగానే రన్ ఉంటుంది. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను పెంచేందుకు సినిమాలోని సాంగ్స్, అనవసర సీన్స్ ను తీసేసి రెండింటినీ కలిపి మూడున్నర గంటలతో సినిమాను రెడీ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుంటుందని బుక్ మై షో ద్వారా వెలుగులోకి రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
దానికి తగ్గట్టే నిర్మాత శోభు యార్లగడ్డ కూడా బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ టైమంత ఉంటుందని అన్నారు. తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ స్పెషల్ ప్రీమియర్ తర్వాత రానా మీడియా ముందుకు రాగా, అతన్ని ఈ విషయంపై ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ రన్ టైమ్ ఎంతున్నా తనకు సంతోషమేన్నారు రానా. ఈ ఇయర్ తాను ఏ సినిమాలో యాక్ట్ చేయకుండానే తనకు బ్లాక్ బస్టర్ రానుందని, అయినా అందరూ చెప్పేంత రన్ టైమ్ ఉంటే ఆడియన్స్ చూస్తారా అని ప్రశ్నిస్తూ దీని రన్ టైమ్ కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని, రాజమౌళి దీని గురించి తనకేమీ చెప్పలేదని చెప్పడంతో ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ కు సంబంధించి రానా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే ఆయన కూడా తనకు తెలీదనడంతో ఈ విషయంపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ను కూడా ఇందులో యాడ్ చేయనున్నారంటున్నారు. సినిమాకు ఇది కొత్తదనాన్ని ఇవ్వడంతో పాటూ రీరిలీజ్ పై ఇంట్రెస్ట్ ను కూడా పెంచుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని సమాచారం. త్వరలోనే కొత్త వెర్షన్ బాహుబలిని రెడీ చేసి దాన్ని సెన్సార్ బోర్డుకు పంపనున్నారట. మరి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
