Begin typing your search above and press return to search.

'బాహుబ‌లి- ది ఎపిక్' ఆ ఆలోచ‌నే సూప‌ర్భ్‌

అయితే అలాంటి కేట‌గిరీకి చెందే సినిమాలు బాహుబ‌లి 1- బాహుబ‌లి 2. అయితే ఈ సినిమాల‌ను విడివిడిగా కాకుండా, క‌లిపి ఒకే సినిమాగా థియేట‌ర్ల‌లో వీక్షించే భాగ్యం క‌లిగితే? ఇలాంటి మాస్ట‌ర్ ప్లాన్ ఇప్పుడు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచుతోంది.

By:  Tupaki Desk   |   14 July 2025 7:15 AM IST
బాహుబ‌లి- ది ఎపిక్ ఆ ఆలోచ‌నే సూప‌ర్భ్‌
X

టైటానిక్, అవతార్-1, ఇంటర్ స్టెల్లార్ లాంటి భారీ సినిమాలను రీరిలీజ్ చేస్తే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. వీటిని భార‌త‌దేశంలో కూడా రీరిలీజ్ చేయ‌గా సంచ‌ల‌న వసూళ్ల‌ను సాధించాయి. ఇటీవ‌ల కొన్ని తెలుగు, హిందీ, త‌మిళ చిత్రాల‌ను రీరిలీజ్ చేయ‌గా, అద్భుత వ‌సూళ్ల‌తో ఆక‌ట్టుకున్నాయి. రీరిలీజైన ప్ర‌తి సినిమాని ప్ర‌జ‌లు చూడ‌రు. కానీ కొన్ని అరుదైన అసాధార‌ణ‌ సినిమాల‌ను మాత్ర‌మే చూస్తారు.

అయితే అలాంటి కేట‌గిరీకి చెందే సినిమాలు బాహుబ‌లి 1- బాహుబ‌లి 2. అయితే ఈ సినిమాల‌ను విడివిడిగా కాకుండా, క‌లిపి ఒకే సినిమాగా థియేట‌ర్ల‌లో వీక్షించే భాగ్యం క‌లిగితే? ఇలాంటి మాస్ట‌ర్ ప్లాన్ ఇప్పుడు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచుతోంది. బాహుబ‌లి 1 , బాహుబ‌లి 2 చిత్రాలు విడివిడిగా రిలీజైన‌ప్పుడు చాలా మంది క‌లిపి వ‌స్తే ఎంతో బావుండేద‌ని భావించారు. ఒక క‌థ‌ను రెండుగా విడ‌దీసి విడి విడిగా చూపించ‌డం అనే ఫార్ములాను తెలివిగా సద్వినియోగం చేసుకున్న ఆర్కా మీడియా- రాజ‌మౌళి బృందాలు, ఇప్పుడు బాహుబ‌లి - ది ఎపిక్ పేరుతో రెండిటిని ఒకే సినిమాగా చూపించి కాసులు కొల్ల‌గొట్ట‌డానికి ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. బాహుబ‌లి చిత్రాన్ని మ‌ళ్లీ ఫ్రెష్ గా చూస్తున్నామా? అనిపించే వీలుంది.

బాహుబ‌లి ది ఎపిక్ చిత్రానికి ఆన్ లైన్ బుకింగ్స్ లో అద్భుత స్పంద‌న వ‌స్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇది దేశంలోని రీరిలీజ్ రికార్డుల‌న్నిటినీ తుడిచేయ‌డం ఖాయ‌మ‌ని కూడా చెబుతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్ప‌టి నుంచి ఆడియెన్ లో బోలెడంత క్యూరియాసిటీ నెల‌కొంది. ఆన్ లైన్ స‌ర్వేల్లో `బాహుబ‌లి ది ఎపిక్`ని థియేట‌ర్ల‌లో చూస్తామ‌న్న ఆడియెన్ అంత‌కంత‌కు పెరుగుతున్నార‌ని స‌మాచారం.