Begin typing your search above and press return to search.

బాహుబలి ది ఎపిక్: వామ్మో... రన్ టైమ్ ఇదేనా..

భారతీయ సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి ఓ సంచలనంగా నిలిచింది.

By:  Tupaki Desk   |   11 July 2025 11:46 AM IST
బాహుబలి ది ఎపిక్: వామ్మో... రన్ టైమ్ ఇదేనా..
X

భారతీయ సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి ఓ సంచలనంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ లాంటి నటులతో తెరకెక్కిన ఈ రెండు భాగాల బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. "బాహుబలి: ది బిగినింగ్" - "బాహుబలి: ది కన్‌క్లూజన్" తో సూపర్ హిట్ సాధించిన రాజమౌళి, ఇప్పుడు అదే గాధను ఒకే భాగంగా మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో చెప్పక్కర్లేదు. 'బాహుబలి ది ఎపిక్' పేరుతో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ సినిమాను వన్ షాట్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ఇప్పటికే తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుండగా, తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో వెబ్‌సైట్‌లో బాహుబలి ది ఎపిక్ మూవీ రన్ టైమ్‌ని చూపిస్తూ 5 గంటలు 27 నిమిషాలు (327 నిమిషాలు)గా నమోదు చేశారు. ఇది నిజమైన రన్‌టైమ్ అనేది క్లారిటీ లేని అంశం. ఒకవేళ ఇదే ఫైనల్ కట్ అయితే, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే లాంగెస్ట్ ఫిలింగా నిలుస్తుందన్న మాట. అయితే ఇది కేవలం ప్లేస్‌హోల్డర్ గా మాత్రమే ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.

ఈ రన్ టైమ్ చూసిన ప్రేక్షకులు మొదట షాక్ అయ్యారు. అయితే ఇది రెండు భాగాలను కలిపి రూపొందించిన వెర్షన్ అని వివరణ ఇవ్వడంతో కొంత మేర ఊరట పడ్డారు. సాధారణంగా సినిమాల రన్ టైమ్ రెండు నుంచి మూడు గంటల మధ్యనే ఉంటే, ఇది దాదాపు అర రోజంతా సాగుతుంది. అందుకే ఇది థియేటర్లలో ఎలా వర్క్ అవుతుందో అన్న చర్చలు మొదలయ్యాయి.

ఇంత పెద్ద రన్ టైమ్‌కి మల్టీపార్ట్ ఇంటర్వెల్స్, ఇంటరాక్టివ్ వెర్షన్ లేదా బ్రేక్‌తో ప్రదర్శించవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. బాహుబలి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే ఈ పేజీలో 10 వేల మందికి పైగా "ఇంటరెస్టెడ్" అని ట్యాగ్ చేయడం చూస్తే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.