బాహుబలి రిలీజ్ టెన్షన్ ను గుర్తు చేసుకున్న నిర్మాత
పార్ట్1 రిలీజైన టైమ్ లో జులై 9న ముంబై లో ఈ సినిమాకు సంబంధించిన మీడియా స్క్రీనింగ్ తర్వాత బాహుబలిని ప్రశంసిస్తూ క్రిటిక్స్ చేసిన ట్వీట్స్ ను కూడా ఆయన తన పోస్ట్ కు యాడ్ చేశారు.
By: Tupaki Desk | 9 July 2025 7:00 AM ISTఇండియన్ సినిమాలోని అత్యంత అద్భుతమైన సినిమాల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ కూడా ఒకటి. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ బాహుబలి మూవీ రిలీజ్ కు ముందు నెలకొన్న పరిస్థితుల్ని, టెన్షన్ ను గుర్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని శోభు తన ఎక్స్ లో రాసుకొచ్చారు. కొన్ని రోజుల్లో బాహుబలి ది బిగినింగ్ రిలీజై పదేళ్లు అవుతుందని, ఈ సినిమా రిలీజ్ కు ముందు ఇదే టైమ్ లో మరియు రిలీజైన కొన్నాళ్ల తర్వాత తాను, ఈ చిత్ర యూనిట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆ సమయంలో ఎంత టెన్షన్ పడ్డారో తెలిపారు. సినిమా రిలీజ్ టైమ్ లో తాను తీసి సేవ్ చేసుకున్న కొన్ని స్క్రీన్‌షాట్స్ ను మళ్లీ ఇప్పుడు చూసుకుంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు శోభు.
పార్ట్1 రిలీజైన టైమ్ లో జులై 9న ముంబై లో ఈ సినిమాకు సంబంధించిన మీడియా స్క్రీనింగ్ తర్వాత బాహుబలిని ప్రశంసిస్తూ క్రిటిక్స్ చేసిన ట్వీట్స్ ను కూడా ఆయన తన పోస్ట్ కు యాడ్ చేశారు. బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఆడియన్స్ లో ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందనే విషయాన్ని అంచనా వేస్తూ రాసిన ఆర్టికల్స్ ను కూడా శోభు పోస్ట్ చేశారు.
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి రెండు భాగాలుగా రిలీజవగా రెండు భాగాలూ ఒకదాన్ని మించి ఒకటి రికార్డులు సృష్టించాయి. బాహుబలి1 జులై 10, 2025న రిలీజై మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే నిర్మాతలు బాహుబలిని ఈ ఏడాది అక్టోబర్ లో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
