బాహుబలి రీ యూనియన్ కు అనుష్క అందుకే రాలేదా?
అంత గొప్ప బాహుబలి సినిమా రిలీజై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం రీయూనియన్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నారు.
By: Tupaki Desk | 11 July 2025 10:56 AM ISTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఆ సినిమా తర్వాతే ప్రభాస్ కు నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడింది. తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది కూడా ఆ సినిమాతోనే.
అంత గొప్ప బాహుబలి సినిమా రిలీజై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం రీయూనియన్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నారు. ఈ రీ యూనియన్ లో బాహుబలికి వర్క్ చేసిన ప్రధాన సభ్యులంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టి మాత్రం ఈ రీయూనియన్ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు.
ఈ రీ యూనియన్ గురించి అందరిలానే అనుష్కను కూడా ముందుగానే ఇన్వైట్ చేశారు. ఆమె కూడా వస్తానని చెప్పారట. కానీ తర్వాత పర్సనల్ రీజన్స్ అని చెప్తూ ఈ రీ యూనియన్ సెలబ్రేషన్స్ కు అనుష్క హాజరవలేదు. అయితే అనుష్కకు ఆడియన్స్ ముందుకొచ్చి కనిపించే ఇష్టం లేకనే ఎలాంటి ఈవెంట్స్‌కు హాజరవడం లేదని తెలుస్తోంది.
బరువు తగ్గలేకపోవడం లాంటి సమస్యల కారణంగా అనుష్క ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. తన అప్‌కమింగ్ సినిమా ఘాటీ రిలీజ్ కు ముందు బహిరంగంగా కనిపించడం ఇష్టం లేదని, అందుకే అనుష్క ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా తనను తాను రహస్యంగా ఉంచుకుంటున్నారని అంటున్నారు. ఘాటీ సినిమా ప్రమోషన్స్ కు కూడా లిమిటెడ్ ఈవెంట్స్‌కే హాజరవుతానని, మీడియా ఇంటరాక్షన్స్ కు దూరంగా ఉంటానని అనుష్క చిత్ర యూనిట్ కు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని కూడా తెలుస్తోంది.
కాగా బాహుబలి రీ యూనియన్ సెలబ్రేషన్స్ లో రాజమౌళి, రమా రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, శోభు యార్లగడ్డ, సెంథిల్ కుమార్, సాబు సిరిల్, ప్రసాద్ దేవినేని, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయ, తమ్మిరాజు, శ్రీనివాస్ మోహన్ హాజరయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తండ్రి రీసెంట్ గా మరణించడంతో ఆయన ఈ సెలబ్రేషన్స్ కు హాజరవలేదు. ప్రస్తుతం ఈ రీ యూనియన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
