Begin typing your search above and press return to search.

బాహుబలి రీ రిలీజ్.. IPL మ్యాచ్ చూసినంత సేపు పట్టదు

తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను మార్చేసిన సినిమా బాహుబలి. 2015లో రిలీజైన ఈ సినిమా పాన్ఇండియా కు ఓ మార్గాం చూపించింది.

By:  Tupaki Desk   |   13 July 2025 4:45 PM IST
బాహుబలి రీ రిలీజ్.. IPL మ్యాచ్ చూసినంత సేపు పట్టదు
X

తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను మార్చేసిన సినిమా బాహుబలి. 2015లో రిలీజైన ఈ సినిమా పాన్ఇండియా కు ఓ మార్గాం చూపించింది. దీనికి కొనసాగింపుగా బాహుబలి 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. అయితే ఈ ఎపిక్ క్లాసిక్ థియేటర్లలో విడుదలై జూలై 10 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. మూవీ టీమ్ అంతా రీ యూనియన్ ఈవెంట్ లో కలుసుకుంది.

ఈ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 31న దీన్ని రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రెండు భాగాలు విడివిడిగా కాకుండా, కంబైన్డ్ చేసి సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. రెండు పార్ట్ ల రన్ టైమ్ చూసినట్లైతే 5 గంటల 27 నిమిషాలు ఉంటుంది. తొలి పార్ట్ 2 గంటల 38 నిమిశాలు ఉండగా, రెండో భాగం 2 గంటల 48 నిమిషాలు ఉంటుంది. అయితే ఇదే రన్ టైమ్ తో రీ రిలీజ్ చేస్తారని ప్రచారం సాగుతోంది.

ఇంత లాంగ్ రన్ టైమ్ ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనిపై మేకర్స్ స్పందించారు. రీ రిలీజ్ చూసేందుకు ఒక రోజంతా పట్టదని, ఓ ఐపీఎల్ మ్యాచ్ చూసినంతసేపే ఉంటుందని ఆడియెన్స్ ఆకట్టుకునే కామెంట్స్ చేసింది మూవీ టీమ్. అయినప్పటికీ ప్రేక్షకులు కన్ విన్స్ అవ్వడం లేదు.

ఐపీఎల్ మ్యాచ్ రన్ టైమ్ కాస్త ఎక్కువైనా, ఫలితం ఆఖరి ఓవర్ వరకు తేలదు. కాబట్టి మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తాం. కానీ బాహూబలి కథ అందరికీ తెలిసిందే. కొత్తగా తెలుసుకోడాని, సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి ఇందులో కొత్తగా ఏమీ లేదు. అందుకే ఇది 5 గంటలకు పైన రన్ టైమ్ ఉంటే కచ్చితంగా బోర్ కొడుతుందని కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై మరోసారి దృష్టి పెట్టిన మూవీ టీమ్ రన్ టైమ్ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది. అందుకే కేవలం ముఖ్యమైన సన్నివేశాలతో రన్ టైమ్ ను మూడు నుంచి మూడున్నర గంటలకు ట్రిమ్ చేయాలని భావిస్తున్నారట. దీంతో ప్రేక్షకులు కాస్త హ్యాపీ ఫీలవుతున్నారు. త్వరలోనే రీ రిలీజ్ రన్ టైమ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.