Begin typing your search above and press return to search.

ప్రభాస్ CEO, అనుష్క HR.. క్రేజీ ట్వీట్ చూశారా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి గురించి అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2025 2:19 PM IST
ప్రభాస్ CEO, అనుష్క HR.. క్రేజీ ట్వీట్ చూశారా?
X

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి గురించి అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా రిలీజ్ అయిన ఆ చిత్రం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ వేదికపై చాటి చెప్పింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపి ఒక మూవీగా రానుంది.

బాహుబలి: ది ఎపిక్‌ టైటిల్ తో సినిమా సందడి రిలీజ్ కానండగా.. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ కూడా అయ్యాయి. అదే సమయంలో ఆ మూవీ రన్ టైమ్ పై ఫుల్ గా చర్చ నడుస్తోంది. బాహుబలి: ది బిగినింగ్‌, బాహుబలి: ది కన్‌క్లూజన్‌ రెండు సినిమాల నిడివి కలిపితే ఐదున్నర గంటలకు పైనే ఉందన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ మొత్తాన్ని మూడున్నర గంటలకు కట్ చేస్తారని తెలుస్తోంది. అయితే కాస్త కష్టమనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. రీసెంట్ గా ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగే సమయానికి రన్ టైమ్ దగ్గరగా ఉంటుందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజీగా ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతోంది.

అయితే నిజానికి మూవీ టీమ్.. ఫుల్ గా ప్రమోట్ చేస్తోంది. రకరకాలుగా సందడి చేస్తోంది. కృత్రిమ మేధ కంపెనీ ఆస్ట్రానమర్‌ సీఈవో ఆండీ.. తన సంస్థ హెచ్‌ ఆర్‌ విభాగంలోని చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ క్రిస్టిన్‌ కాబోట్‌ ను ఆండీ హగ్ చేసుకుని ముద్దాడుతూ కనిపించారు. ఫాక్స్‌బోర్గ్‌ గిల్లెట్‌ స్టేడియం కోల్డ్‌ ప్లే కాన్సర్ట్‌ లో కెమెరా కంటపడ్డారు.

ఆ తర్వాత వెంటనే ఇద్దరూ సైలెంట్ అయ్యి దాకున్నారు. అప్పుడే హోస్ట్.. వారు అఫైర్‌ లో అయినా ఉండి ఉండాలని, లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలని అన్నారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ వీడియోను మూవీ టీమ్ ట్వీట్ చేసింది. బాహుబలి సినిమాలోని ప్రభాస్- అనుష్క పిక్ ను షేర్ చేసింది.

CEO, మహిష్మతి HR అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ ఫుల్ గా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. సూపర్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రమోషన్స్ వేరే లెవెల్ అని చెబుతున్నారు. కాగా.. అక్టోబరు 31న బాహుబలి: ది ఎపిక్‌ మూవీ థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.