Begin typing your search above and press return to search.

సూప‌ర్ హిట్ ప్రాంచైజీ నుంచి నెంబ‌ర్-4!

బాలీవుడ్ యాక్ష‌న్ ప్యాక్డ్ `భాఘీ` స‌క్సెస్ పుల్ ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   22 March 2024 7:48 AM GMT
సూప‌ర్ హిట్ ప్రాంచైజీ నుంచి నెంబ‌ర్-4!
X

బాలీవుడ్ యాక్ష‌న్ ప్యాక్డ్ `భాఘీ` స‌క్సెస్ పుల్ ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `భాఘీ`..` భాఘీ-2`.. `బాఘీ-3` చిత్రాలు ఎలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయో తెలిసిందే. టైగ‌ర్ ష్రాప్ మెరుపు యాక్ష‌న్ స‌న్నివేశా ల‌తోనే ఆ రేంజ్ స‌క్స‌స్ సాధ్య‌మైంది. సబ్బీర్ ఖాన్ తెర‌పైకి తెచ్చిన ఈ ప్రాంచైజీ అటుపై చేతులు మారింది. మిగిలిన రెండు భాగాల్ని అహ్మ‌ద్ ఖాన్ తెర‌కెక్కించి అంత‌కంత‌కు హైప్ తీసుకొచ్చాడు.

స‌బ్బీర్ ఖాన్ మేకింగ్ ని మించి అమ్మ‌ద్ ఖాన్ త‌న మార్క్ వేసాడు. తాజాగా ఈ ప్రాంచైజీ నుంచి `భాఘీ-4` కూడా రాబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. యాధావిధిగా టైగ‌ర్ ష్రాప్ ఇందులోనూ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా టైగ‌ర్ మ‌నసులో భావాలు పంచుకున్నాడు. `నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన‌...స‌వాల్ విసిరిన ప్రాంచైజీ ఇది. అత‌డు త‌న కుటుంబం కోసం పోరాడాడు.

ఒక దేశానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసాడు. భాఘీ ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన అధ్యాయం రాబోతుంది` అంటూ టైగ‌ర్ సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసాడు. ఈ చిత్రాన్ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా..హై ఆక్టేన్ యాక్ష‌న్ మించి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. సాజిద్ న‌డియావాలా య‌ధా విధిగా ఈ చిత్రానికి నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. మూడు భాగాల్ని కూడా ఆయ‌నే నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ద‌ర్శ‌కుడు పేరు మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో అహ్మ‌ద్ ఖాన్ ని కొన‌సాగిస్తారా? కొత్త మేక‌ర్ ని రంగంలోకి దించుతారా? లేక భాఘీ సృష్టిక‌ర్త స‌బ్బీర్ ఖాన్ ని మ‌ళ్లీ తెర‌పైకి తెస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాప్ వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అక్ష‌య్ కుమార్ తో క‌లిసి `బ‌డేమియాన్ చోటే మియాన్` లో న‌టిస్తున్నాడు. అలాగే `సింగ్ ఎగైన్` లోనూ న‌టిస్తున్నాడు. జ‌గ‌న్ శ‌క్తి ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసాడు. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత `భాఘీ-4` గురించి మ‌రింత స‌మాచారం రానుంది.