Begin typing your search above and press return to search.

క్యాన్సర్ ను జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడే వారు దీన్ని అంత తొందరగా గుర్తించలేరు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 2:35 PM GMT
క్యాన్సర్ ను జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడే వారు దీన్ని అంత తొందరగా గుర్తించలేరు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. నిశితంగా గమనిస్తే ముందస్తుగానే దీన్ని గుర్తించే అవకాశముంది. తద్వారా చికిత్స పొంది వ్యాధిని జయించవచ్చు.

అయితే క్యాన్సర్ బారిన పడ్డ పలువురు సెలబ్రెటీలు ఆ వ్యాధిని జయించిన విషయం తెలిసిందే. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, హంసా నందిని, గౌతమి, సంజయ్‌ దత్‌, అనురాగ్‌ బసు తదితర ప్రముఖులు వివిధ రకాల క్యాన్సర్లకు ఎదురొడ్డి పోరాడారు. ఇక బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా సతీమణి తహీరా కశ్యప్‌ కూడా కొన్నేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ ను జయించారు.

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా.. సోషల్ మీడియాలో ఆయుష్మాన్‌ ఖురానా తన వైఫ్ తహీరపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తీవ్రమైన క్యాన్సర్ తో పోరాడి జయించడంలో తన భార్య ప్రదర్శించిన ధైర్యాన్ని ఖురానా మెచ్చుకున్నారు. తన గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటానని ఆమె క్యాన్సర్ ను ఎదిరించి గెలిచిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

"పంజాబ్ యూనివర్శిటీలో హట్ నంబర్ 14లో నేను సమోసా, చాయ్ చూపించి పడగొట్టిన అమ్మాయి. ఈరోజు @spokenfestలో నీ డెబ్యూకి (తెరంగేట్రానికి) ఆల్ ది బెస్ట్. నీ చక్కటి మనసును నేను ప్రేమిస్తున్నాను" అంటు ఫొటోలతోపాటు ఆమె వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేశారు. ఓ క్యూట్ మిర్రర్ సెల్ఫీతో పాటు తహీరా పోస్ట్ సర్జరీ పిక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న ఆయుష్మాన్.. తహీరా కశ్యప్ అనే అమ్మాయిని కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమించారు. 2008లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2018లో తహీరకు రొమ్ము క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. సరైన చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం తహీర పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది.