Begin typing your search above and press return to search.

ఆ యంగ్‌ హీరోకి 'ఉత్తమ నటి' అవార్డ్ ఖాయమట

ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నిలిచాడు

By:  Tupaki Desk   |   2 Aug 2023 6:45 AM GMT
ఆ యంగ్‌ హీరోకి ఉత్తమ నటి అవార్డ్ ఖాయమట
X

బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ను ఆరంభించిన ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆయుష్మాన్ ఖురానా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం ఈ యువ హీరో 'డ్రీమ్ గర్ల్‌ 2' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆయుష్మాన్ కు జోడీగా లైగర్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి మొదలైంది. ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆయుష్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కథానుసారం ఈ సినిమాలో తాను ఎక్కువ శాతం అమ్మాయిగానే కనిపిస్తాను. అందుకే ఈ సినిమాలో అమ్మాయిగా అద్భుతమైన నటన ప్రదర్శించేందుకు గాను ఉత్తమ నటి అవార్డుకు గాను నామినేట్‌ అవ్వడం లేదా.. ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవడం చేస్తానేమో అంటూ తన పాత్ర గురించి తానే సరదా వ్యాఖ్యలు చేశాడు.

డ్రీమ్‌ గర్ల్‌ 2 సినిమాలోని తన పాత్ర కోసం చాలా బరువు తగ్గాయి. ముఖ్యంగా అమ్మాయిగా కనిపించే సన్నివేశాల కోసం మేకోవర్‌.. ఇతర విషయాల కోసం చాలా కష్ట పడినట్లు ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. తన కష్టం కోసం తప్పకుండా అవార్డు ను రావాలని కోరుకుంటున్నట్లు ఈ హీరో సరదాగా కామెంట్ చేశాడు.