Begin typing your search above and press return to search.

ఆయేషా ఖాన్.. ఎద అందాలతో కిర్రాక్ అనేలా..

సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ముంబై బ్యూటీ కోసమే వెతికేస్తున్నారు యూత్.

By:  Tupaki Desk   |   2 April 2024 4:30 PM GMT
ఆయేషా ఖాన్.. ఎద అందాలతో కిర్రాక్ అనేలా..
X

తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను ఇప్పుడు ఒక ఊపు ఊపేస్తున్న పేరు ఆయేషా ఖాన్. అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఒక్కసారిగా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకుంది. యూత్ కలల రాణి గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ముంబై బ్యూటీ కోసమే వెతికేస్తున్నారు యూత్. అంతలా ఈ అమ్మడు కుర్రకారును అల్లాడిస్తోంది.


ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఆయేషా ఖాన్.. ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మోత మోగిపోద్ది లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆ పాటతో అందరినీ ఒక ఊపు ఊపేసింది ఆయేష. తన ఎక్స్ ప్రెషన్స్ తో ఓ రేంజ్ లో అలరించింది. పక్కా మాస్ మసాలా సాంగ్ అంటే ఇలానే ఉండాలన్నట్లు డ్యాన్స్ చేసింది. విశ్వక్ తో స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంటోంది.


ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. చీరలతో పాటు మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. గ్లామర్ షోతో అలరిస్తుంటోంది. తాజాగా క్రేజీ మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. మోత మోగిపోద్ది సాంగ్ ఔట్ ఫిట్ లో దిగిన పిక్ తో నెట్టింట హీట్ పుట్టించింది. వైట్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో కవ్విస్తోంది. నాభిపై ఉన్న వడ్డాణం, సన్నని పైట ఆమె అందాన్ని మరింత పెంచాయి. మరో పిక్ లో బ్లూ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో లాంగ్ సెల్ఫీ తీసుకుని ఆకట్టుకుంటోంది.


ప్రస్తుతం ఆయేషా ఖాన్ పిక్స్.. నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ నయా లక్కీ గర్ల్ గ్లామర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకోనుందని జోస్యం చెబుతున్నారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఆయేష.

2022లో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసిన ముఖ చిత్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆయేష. కానీ ఈ సినిమా చాలా మందికి తెలియదు. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఓం భీమ్ బుష్ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటెం సాంగ్ తో అందాల విందు పంచింది. ఇక ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.