Begin typing your search above and press return to search.

బ్లాక్ శారీలో GOG పాప బ్లాస్టింగ్ గ్లామర్

మరోవైపు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. స్టైలిష్ తోపాటు ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ తో ఫొటోలు దిగి సందడి చేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 12:30 PM GMT
బ్లాక్ శారీలో GOG పాప బ్లాస్టింగ్ గ్లామర్
X

అయేషా ఖాన్‌.. ఈ పేరు ఇటీవలే టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం ఓ తెలుగు సినిమా చేసిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇక్కడి ప్రేక్షకులను అలరించనుంది. అది కూడా హీరోయిన్ గా కాదు.. ఐటమ్ గర్ల్ గా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈమె పేరు మరోసారి టాలీవుడ్ సినీ సర్కిల్ లో మార్మోగిపోతోంది.

అయితే ఈ అమ్మడు.. 2022లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో కనిపించిన ముఖచిత్రం సినిమాలో యాక్ట్ చేసి తన నటనతో ఆకట్టుకుంది. ఫేస్ మార్ఫింగ్ బ్యాక్‌ డ్రాప్‌ తో ఈ మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయని ఈ బ్యూటీ.. హిందీ బిగ్ బాస్ సీజన్-17 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజులకే బయటకొచ్చిన అయేషా.. ఇటీవలే తెలుగులో ఫస్ట్ ఐటమ్ సాంగ్ చేసింది.

మరోవైపు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. స్టైలిష్ తోపాటు ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ తో ఫొటోలు దిగి సందడి చేస్తుంటుంది. కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. సింపుల్ మేకప్ తో అట్రాక్ట్ చేస్తోంది. వైట్ కలర్ సూపర్ నెక్ సెట్ వేసుకున్న ఈ అమ్మడు.. మెరిసిపోతోంది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.


ప్రస్తుతం అయేషా ఖాన్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే విశ్వక్ సేన్ తో కలిసి చిందులేయడంతో మాస్ కా దాస్ ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతున్నారు. ఐటమ్ సాంగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. టాలీవుడ్ కు సూపర్ ఐటమ్ గర్ల్ దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు. వరుస అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు.


మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన ఈ బ్యూటీ.. 2003లో మెహందీ టీవీ సీరియల్ తో యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్లాంజ్‌ బారెరెన్, మాన్-ఓ-సల్వా, చార్ చంద్, ఖుదా జమీన్ సే గయా నహిన్, వాస్ల్ వరుస సీరియళ్లు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. జవానీ ఫిర్ నహీ అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ తో ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో చూడాలి.