ఆయేషా ఖాన్.. ఒక్కసారిగా హీట్ పుట్టించేసిందిగా!
బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి అమ్మడు.
By: Tupaki Desk | 2 Jun 2025 10:38 AM ISTబాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి అమ్మడు. ఆ మూవీలో మోత మోగిపోద్ది అంటూ తన వేరే లెవెల్ గ్లామర్ అండ్ స్టెప్పులతో మోత మోగించేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఆమె వల్ల సాంగ్ హిట్టయింది.
అయితే అంతకుముందే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆ సినిమాలో తన యాక్టింగ్, గ్లామర్ తో ఆకట్టుకుందనే చెప్పాలి ఆయేషా ఖాన్.
అలా టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతమైంది. కానీ అప్పటికే చాలా ఏళ్ల క్రితం ఆయేషా.. తెలుగులో ఓ మూవీ చేసింది. విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో నటించిన ముఖచిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ తర్వాత హిందీ సీరియల్స్ కు పరిమితమైంది. హిందీ బిగ్ బాస్ తో మళ్లీ క్రేజ్ సంపాదించుకోగా.. సినిమా ఛాన్స్ లు వచ్చాయి.
ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్న అమ్మడు.. కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తరచూ ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ తెగ ట్రెండ్ అవుతుంటుంది ఆయేషా ఖాన్.
అటు ట్రెడిషనల్ గా.. ఇటు మోడ్రన్ గా అందాలు ఆరబోసి అందరినీ ఫిదా చేస్తుంటుంది అమ్మడు. రీసెంట్ గా ఒక్కసారిగా నెట్టింట హీట్ పుట్టించింది. ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకున్న బ్యూటీ.. రకరకాల పోజులతో మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి. సింపుల్ గా హెయిర్ లీవ్ చేసి కుర్రాళ్ల మనసులు దోచేసుకుంది ఆయేషా ఖాన్.
బెడ్ పై ఇచ్చిన పోజులు అయితే వేరే లెవెల్. ప్రస్తుతం ఆయేషా ఖాన్ పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ మారగా, ఆమె అందానికి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని నెటిజన్లు అంటున్నారు. బ్యూటీ లుక్స్ కు ఫ్లాట్ అయ్యామని చెబుతున్నారు. క్యూట్ గా ఉంటూనే హీట్ పుట్టించిందని కామెంట్లు పెడుతున్నారు. అందానికి ఇమేజ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
