వార్ 2 దెబ్బకి ధూమ్ 4 దొబ్బింది !
ధూమ్ ఫ్రాంఛైజీ నుంచి మోస్ట్ అవైటెడ్ `ధూమ్ 4` సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
By: Sivaji Kontham | 23 Oct 2025 9:43 AM ISTధూమ్ ఫ్రాంఛైజీ నుంచి మోస్ట్ అవైటెడ్ `ధూమ్ 4` సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని కథనాలొచ్చాయి. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు, బ్రహ్మాస్త్ర , వార్ చిత్రాల దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అయాన్ ఈ సినిమా నుంచి స్నేహపూర్వకంగా తప్పుకున్నాడు. అతడు రణబీర్ -ఆదిత్య చోప్రాలతో స్నేహాన్ని కొనసాగిస్తాడు. ప్రాజెక్ట్ ని వదులుకునే ముందు ఆ ఇద్దరితో విస్త్రతంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
నిజానికి వార్ 2, ధూమ్ 4 చిత్రాలు తన జానర్ సినిమాలు కావని అయాన్ ముఖర్జీ నమ్ముతాడు. ఎప్పుడూ తన కోసం ఉద్దేశించిన స్క్రిప్టులు కావు ఇవి.. రొమాంటిక్ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించేందుకు అయాన్ ముఖర్జీ ఎప్పుడూ ఇష్టపడతారు. కానీ అందుకు భిన్నంగా అతడు యాక్షన్ సినిమాలకు ఎంపికయ్యాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన `వార్ 2` డిజాస్టర్ అవ్వడానికి ఇలాంటి ఒక అన్ నోన్ రీజన్ కూడా పని చేసిందని అభిమానులు భావిస్తున్నారు.
ధూమ్ 4 కి శ్రీరామ్ రాఘవన్ స్క్రిప్టును అందించారు. స్క్రిప్టు పనుల్లో నిర్మాత ఆదిత్య చోప్రా కూడా ఒక భాగం. ధూమ్ లో జాన్ అబ్రహాం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ ప్రధానమైన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించగా, ఇప్పుడు రణబీర్ కపూర్ ధూమ్ 4లో ఆ తరహా పాత్రలో నటించనున్నారు. అయితే అయాన్ ముఖర్జీ తప్పుకున్నారు గనుక, ధూమ్ 4 కోసం దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ధూమ్ 4 నుంచి వైదొలిగిన తరవాత దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2 పై దృష్టి సారించారని తెలిసింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్రకు థియేట్రికల్ గా మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒక అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్రను పురాణేతిహాస కథతో భారీ విజువల్ గ్రాఫిక్స్ తో రూపొందించగా, అది బాక్సాఫీస్ వద్ద కాస్ట్ ఫెయిల్యూర్ గా మారిందని కూడా కథనాలొచ్చాయి. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని రూపొందించేందుకు అయాన్ ముఖర్జీ ఆసక్తిగా ఉన్నా రణబీర్ కపూర్ కఠినమైన షెడ్యూళ్ల కారణంగా ఇది ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.
