Begin typing your search above and press return to search.

SK ఏలియన్.. తెలుగు ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే!

తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తెలుగు లో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని భావించారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 6:48 AM GMT
SK ఏలియన్.. తెలుగు ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే!
X

తమిళ హీరోల్లో పలువురికి తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో తమిళ యంగ్‌ హీరో శివ కార్తికేయన్‌ (SK) కి కూడా తెలుగు లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగు లో డబ్‌ అవుతోంది.

ఆ మధ్య తెలుగు దర్శకుడితో తెలుగు సినిమాను కూడా చేసిన శివ కార్తికేయన్ కి తెలుగు లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ బాగానే పెరిగింది. అందుకే ఆయన నటించిన అయలాన్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏలియన్‌ భూమి మీదకు వచ్చి మానవుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌ తో సరదాగా తీసుకు వచ్చిన సినిమా అయలాన్‌. ఈ సినిమాను జనవరి నెలలో పొంగల్ సందర్భంగా తమిళనాట విడుదల చేశారు. ఆ సమయంలోనే తెలుగు లో విడుదల చేయాలి అనుకుంటే తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా వాయిదా వేశారు.

తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తెలుగు లో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని భావించారు. పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. థియేటర్‌ లు బుక్‌ చేయడం.. టికెట్లు ఇవ్వడం అంతా జరిగింది. కానీ చివరి నిమిషంలో లీగల్‌ ఇష్యూ కారణంగా తెలుగు లో అయలాన్ ను విడుదల చేయకపోవడంతో శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.

థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ కి ఛాన్స్ లేక పోయినా త్వరలో ఓటీటీ లో వస్తుందని చాలా రోజులుగా అంతా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ లో అయలాన్ వచ్చేసింది. కానీ మళ్లీ తెలుగు ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. సన్ నెక్ట్స్ లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు మరియు ఇతర భాషల స్ట్రీమింగ్‌ లేదు.

మరేదైనా ఓటీటీ లో అయలాన్‌ ను స్ట్రీమింగ్‌ చేస్తారా.. తెలుగు ప్రేక్షకులు అక్కడ చూడవచ్చా అనుకుంటే అది కూడా లేదు. అసలు తెలుగు లో స్ట్రీమింగ్ లేదని తేలిపోయింది. దాంతో శివ కార్తికేయన్ తెలుగు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అయ్యో అంటూ నిట్టూర్చుతున్నారు.