Begin typing your search above and press return to search.

అయలాన్ తెలుగు రిలీజ్.. ఈ సడెన్ ట్విస్టెంటీ..

శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అయలాన్ కోలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయిపొయింది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 7:30 AM GMT
అయలాన్ తెలుగు రిలీజ్.. ఈ సడెన్ ట్విస్టెంటీ..
X

శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అయలాన్ కోలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయిపొయింది. సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో ఏలియన్స్ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. జనవరి 26న తెలుగులో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. హీరో శివకార్తికేయన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొని మూవీ గురించి మాట్లాడారు. మూవీ ట్రైలర్ నచ్చడంతో పాటు హనుమాన్ తప్ప చెప్పుకోదగ్గర మూవీస్ థియేటర్స్ లో లేకపోవడంతో అయలాన్ మూవీ చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్టారని.. రిపబ్లిక్ డే కావడంతో దొరికిన సెలవుని సినిమాకి వెళ్లి వినియోగించుకోవాలని అనుకున్నారు.

అయితే మార్నింగ్ షో టికెట్లు అమ్మిన తర్వాత సడెన్ గా మూవీ రిలీజ్ కావడం లేదని టికెట్లు వాపస్ ఇచ్చేసారంట. థియేటర్స్ యజమానులు ఆడియన్స్ తీసుకున్న టికెట్లకి డబ్బులు ఇచ్చేసి మూవీ రిలీజ్ కావడం లేదని చెప్పారంట. అయలాన్ మూవీ ఆర్ధిక సమస్యల వలన రిలీజ్ వాయిదా పడినట్లు, మళ్ళీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు.

అయితే ఎందుకని ఇలా రిలీజ్ అనౌన్స్ చేసి టికెట్లు కూడా అమ్మేసిన తర్వాత ఉన్నపళంగా సినిమాని వాయిదా వేశారనేది ప్రేక్షకులకి అర్ధం కానీ విషయంగా మారింది. ఇదే రోజు ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఆ సినిమాకి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాట కూడా కెప్టెన్ మిల్లర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన మూవీ కావడంతో పాటు యాక్షన్ సీక్వెన్స్ పవర్ ఫుల్ గా అర్జున్ మాతేశ్వరన్ డిజైన్ చేశాడు. ఈ నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ కి కెప్టెన్ మిల్లర్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ రోజు థియేటర్స్ లోకి వస్తున్నాయి. వాటికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనేది చూడాలి. హాన్సిక మోత్వానీ 105 మినిట్స్ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది.