బీచ్ రిసార్ట్‌లో హీరోయిన్ విలాసాలు
తాజాగా అవ్ నీత్ గ్లామరస్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 30 Jun 2025 7:00 AM ISTవేడెక్కించే ఫోటోషూట్లతో నిరంతరం అందరి దృష్టి తనవైపు ఉండేలా చూసుకోవడంలో అవ్ నీత్ చాణక్యం మెచ్చదగినదే. కానీ ఈ భామ ఇటీవల హద్దు మీరుతోంది. టూమచ్ గా గ్లామర్ ని ఆరబోసేందుకు ఉత్సాహపడుతోంది. తాజాగా అవ్ నీత్ గ్లామరస్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బికినీ బీచ్ లో ఒక అందమైన రిసార్ట్ లో అవ్ నీత్ ఫుల్ గా చిల్ చేస్తోంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ సహా ప్రతిదీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అక్కడే జాగింగ్.. జిమ్.. స్విమ్మింగ్ సహా సకలసౌకర్యాలు అవ్ నీత్ కి అందుబాటులో ఉన్నాయని అర్థమవుతోంది.
అవనీత్ కౌర్ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి, అటుపై సినీరంగంలో ప్రవేశించింది. కౌర్ మర్దానీలో మీరా పాత్రతో టికు వెడ్స్ షేరులో టికు పాత్రలతో పాపులరైంది. చంద్ర నందినిలో చారుమతి, అలాద్దీన్‌లో యాస్మిన్ - నామ్ తో సునా హోగా చిత్రాల్లో పాత్రలతో ఆకట్టుకుంది. కౌర్ 2010లో జీటీవీ డ్యాన్స్ షో `డాన్స్ ఇండియా డాన్స్- లిటిల్ మాస్టర్స్`తో తన వృత్తిని ప్రారంభించింది. అవ్ నీత్ సెమీ-ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్‌లో పాల్గొంది. ఈ వేదికలో ఆమె `డ్యాన్స్ ఛాలెంజర్స్` బృందంలో చేరింది. కౌర్ 2012లో లైఫ్ ఓకే మేరీ మాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె జిల్మిల్ పాత్రను పోషించింది. ఆ తర్వాత సాబ్ టీవీలో తేధే హై పర్ తేరే మేరే హైన్‌లో నటించింది. 2012లో, కలర్స్ టీవీ సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది, అక్కడ ఆమె దర్శీల్ సఫారీతో పోటీ పడింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలు అవ్ నీత్. స్వతహాగానే క్రేజీ షోలలో చూసిన ప్రజలు తనను అభిమానించడం ప్రారంభించారు.
అటుపై కౌర్ లైఫ్ ఓకే లో సావిత్రి - ఏక్ ప్రేమ్ కహానీలో నటించింది. అందులో రాజకుమారి దమయంతి పాత్ర పోషించింది. ఆగస్ట్ 2013లో కౌర్ జీ టీవీ `ఏక్ ముత్తి ఆస్మాన్`లో పాఖీ పాత్ర పోషించింది. కౌర్ 2014లో ప్రదీప్ సర్కార్ `మర్దాని`తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అటుపై వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమె సన్నీ సింగ్ సరసన లవ్ కి అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా నటించింది.
