అందాల అవ్నీత్ బ్లాక్ అండ్ వైట్ షో చూస్తారా..?
హిందీ టెలివిజన్ ప్రేక్షకులకు అవ్నీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By: Tupaki Desk | 11 Jun 2025 9:00 PM ISTహిందీ టెలివిజన్ ప్రేక్షకులకు అవ్నీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కి కూడా ఉండదు అంటారు. బుల్లి తెరపై రచ్చ చేసే అవ్నీత్ కౌర్ వెండి తెరపై కూడా తనదైన ముద్ర వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ , ఝలక్ దిఖ్లా జా 5 , మర్దానీ , చంద్ర నందిని , అలాద్దీన్ – నామ్ తో సునా హోగా , టికు వెడ్స్ షేరు వంటి ప్రాజెక్ట్‌లు ఈమెను హిందీ ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం అంటూ అభిమానులు కామెంట్ చేస్తూ ఉంటారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ప్రస్తుతం నార్త్‌లో మోస్ట్ పాపులర్ స్టార్.
ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్నీత్ కౌర్‌కి ఏకంగా 32 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ అనగానే కాస్త ఆసక్తి తక్కువ ఉంటుంది. కానీ బ్లాక్ అండ్ వైట్‌లోనూ అవ్నీత్ కౌర్ కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేసే విధంగా అందంగా ఈమె ఉంది. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా చేయడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. నెట్టింట ఎప్పటిలాగే ఈమె అందాల ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది.
కవ్వించే చూపులతో, క్లీ వేజ్ షో తో బ్లాక్ అండ్ వైట్‌లోనూ అందాల అవ్నీత్ కౌర్ మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. నెట్టింట ఈమె ఫోటోలు గతంలో ఎన్నో సార్లు వైరల్ అయ్యాయి. మరోసారి ఈ ఫోటోలతో ఈమె చర్చనీయాంశంగా మారింది. ఇంతటి అందగత్తె ఎప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను చేస్తున్న ఈమె సీరియల్స్‌కి మాత్రం దూరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించేందుకు గాను ఆసక్తిని కనబర్చుతూ ఉంది. కానీ ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు ఈమెను ఆరాధిస్తూనే ఉన్నారు.
2001, అక్టోబర్ 13న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన అవ్నీత్ కౌర్ పెరిగింది మాత్రం ముంబై. 2010లో జీ టీవీలో ప్రసారం అయిన డాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ లో మాస్టర్స్ డ్యాన్స్ షో లో పాల్గొంది. ఆమె సెమీ ఫైనల్స్ సమయంలో ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత కూడా పలు డాన్స్ షో ల్లో పాల్గొంది. బుల్లి తెరపై తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ముందు ముందు హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. 10 ఏళ్ల వయసు నుంచి దేశం మొత్తం తన వైపుకు చూసే విధంగా చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె డాన్స్ షో లకు మంచి స్పందన దక్కుతూ ఉంటుంది. అందుకే ఈమె హీరోయిన్‌గా నటించిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ రేంజ్ పాపులారిటీకి ఈమె అందం కూడా ఒక కారణం అనే అభిప్రాయం ఉంది.
