Begin typing your search above and press return to search.

అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ.. యాక్టర్ టార్గెట్ గా కామెంట్స్..!

వనవీర ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ లో తానొక యాక్టర్ గానో, డైరెక్టర్ గానో కాదు నిర్మాతగా మాట్లాడుతున్నా అన్నారు.

By:  Ramesh Boddu   |   28 Dec 2025 11:44 AM IST
అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ.. యాక్టర్ టార్గెట్ గా కామెంట్స్..!
X

సినిమా పరిశ్రమలో చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అనేది ఉండదు. ఎక్కడైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే.. కానీ కొంతమంది యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు తీసుకుని దానికి తగిన న్యాయం చేయట్లేదని అంటున్నారు వనవీర డైరెక్టర్ కమ్ యాక్టర్ అవినాష్. మొన్నటిదాకా వానర టైటిల్ గా ప్రమోట్ చేయబడిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్పు చేశామని వానర ఇప్పుడు వనవీరగా రాబోతుందని అన్నారు అవినాష్.

నిర్మాత కాళ్లకు మేకులు..

వనవీర ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ లో తానొక యాక్టర్ గానో, డైరెక్టర్ గానో కాదు నిర్మాతగా మాట్లాడుతున్నా అన్నారు. నిర్మాతలు నా స్నేహితులే.. నిర్మాతకు ఎన్నో మేకులు కాళ్లకు కుచ్చుకుంటాయి.. అవి తీసి జేబులో పెట్టుకుని వెళ్తుంటారని అన్నారు అవినాష్. మేమంతా కొత్త వాళ్లం కాబట్టి తెలిసిన వాళ్లను తీసుకుంటాం. వాళ్లు సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగపడతారని అనుకుంటాం. చిన్న సినిమాలకు మైక్రో ప్రమోషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈవెంట్స్, చిన చిన్న వీడియోస్, మైక్రో ప్రమోషన్స్ ఇవన్నీ జనాల్లోకి వెళ్తాయి. ఇవే చిన్న సినిమాలకు చాలా ఇంపార్టెంట్.

తాను ఒక్కడినే చేస్తే అది వర్క్ అవుట్ అవ్వవు.. నాది కొత్త ఫేస్ అందుకే ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ ని తీసుకున్నాం.. వాళ్లతోనే ప్రమోషన్స్ చేసుకుందాం అనుకున్నాం కానీ మేము పెట్టుకున్న వాళ్లు ప్రమోషన్స్ చేయట్లేదు. వాళ్లు కనీసం మా సినిమా గురించి ఒక పోస్ట్ కూడా పెట్టలేదని అన్నారు అవినాష్. లక్షలు లక్షలు రెమ్యునరేషన్స్ తీసుకుంటారు కానీ ప్రమోషన్స్ కి సపోర్ట్ చేయరు. ఇష్టం లేకపోతే వేరేవి చేసుకోవచ్చు కదా.. వాళ్ల సినిమాలను వారు ప్రమోట్ చేసుకుంటారు.. సైడ్ రోల్స్ చేసిన సినిమాలు ప్రమోట్ చేస్తారు. మేం ఏం తప్పు చేశాం కొత్త వాళ్లమనా.. అది తప్పు తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి కదా అని అన్నారు అవినాష్.

తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి..

ఇదే స్పీచ్ లో భాగంగా మీరేమే బయటకు వెళ్లి నేను మంచోడిని ఇన్నేళ్లు అయ్యింది సక్సెస్ లేదు కష్టపడతాను సక్సెస్ అవ్వాలి అని చెప్పుకుంటున్నారు ఐతే ఒక నిర్మాత దగ్గర తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కదా అంటూ అవినాష్ ఆ యాక్టర్ టార్గెట్ గా కామెంట్స్ చేశారు.

ఐతే అవినాష్ టార్గెట్ చేసిన ఆ యాక్టర్ ఎవరనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఐతే వానర అదే ఇప్పుడు వనవీరగా వస్తున్న సినిమాలో నందు ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ప్రస్తుతం అతను లీడ్ రోల్ లో చేసిన సైక్ సిద్ధార్థ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన దండోరా సినిమాలో కూడా అతను నటించాడు కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా నందు పాల్గొన్నాడు. కానీ వనవీర ప్రమోషన్స్ లో నందు కనిపించట్లేదు. మరి వాళ్ల మధ్య ఏం జరిగింది అన్నది తెలియదు కానీ నందు టార్గెట్ గా అవినాష్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

మా టైటిల్ ఇది మా స్టోరీ ఇది అని ఛాంబర్ లో రిజిస్టర్ చేశాం..

మా సినిమా గురించి సెన్సార్ వాళ్లు అబ్జెక్ట్ చేశారు.. ఇది మా రూల్స్ ఇది ఉంటే మేము ప్రొసీడ్ అవ్వలేమని అన్నారు.. మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా టైటిల్, మా స్టోరీ ఇది అని ఛాంబర్ లో రిజిస్టర్ చేశాం. అప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు రిజెక్షన్ రాలేదు. ఈ ఇండస్ట్రీ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చెబితే మా లాంటి వాళ్లకి ఈ ప్రాబ్లం ఉండదు. ఏడేళ్ల క్రితం ఇలాంటి సమస్య ఒక సినిమాకు వచ్చింది.

వాల్మీకి సినిమా టైటిల్ చివర్లో గద్దలకొండ గణేష్ అని మార్చారు. అక్కడ స్టార్ కాస్ట్ ఉంది స్టార్ డైరెక్టర్ ఉన్నాడు పెద్ద ప్రొడక్షన్ ఉంది కాబట్టి వాళ్లు కోలుకోగలరు. మాలాంటి వాళ్లకు ఎలా ఉంటుంది. ఒక లిమిటెడ్ బడ్జెట్ తో వస్తున్నప్పుడు 70 పర్సెంటి ప్రమోషనల్ బడ్జెట్ స్పెంట్ చేసేశాం. వానర టైటిల్ జనాల్లో రిజిస్టర్ చేయాలని చేశాం. కానీ లాస్ట్ ఐదు రోజులు ముందు వనవీర టైటిల్ తో అది ఎలా తీసుకెళ్లాలి అని టూ డేస్ నుంచి బ్లాంక్ అయ్యాం.. దాని కావాల్సింది మీడియా సపోర్ట్ మీడియా ఈ సినిమాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ రోజు మార్నింగ్ మీ అందరినీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తానని అన్నారు అవినాష్.