ఎంగేజ్మెంట్ చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. పిక్స్ చూశారా?
అలా పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చిన అవికా గోర్.. తాజాగా మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం జరిగిన పిక్స్ ను షేర్ చేసింది.
By: Tupaki Desk | 12 Jun 2025 12:51 AM ISTచిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్న వయసులోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్. హిందీ సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో టీనేజ్ లో ఉన్నప్పుడే హీరోయిన్ గా మారింది. అది కూడా టాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది.
అదే సమయంలో అమ్మడు కొంతకాలంగా మిలింద్ చాంద్వాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడిని, వాళ్ల పేరెంట్స్ ను పరిచయం చేసింది అవిక. ఆ మధ్య తనకు పెళ్లయిపోయిందని వచ్చిన వార్తలపై రెస్పాండ్ అయ్యి.. బ్రెయిన్ లో ఎప్పుడో పెళ్లయిపోయిందని, కానీ బయట ఇంకా అవ్వలేదని చెప్పింది.
అలా పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చిన అవికా గోర్.. తాజాగా మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం జరిగిన పిక్స్ ను షేర్ చేసింది. అందులో ప్యేస్టల్ కలర్ శారీలో ఉన్న అమ్మడు.. చాలా క్యూట్ గా ఉందని చెప్పాలి. ఆమె నవ్వు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారగా.. అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.
అయితే ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేస్తూ లాంగ్ నోట్ ను రాసుకొచ్చింది అవిక. "ఆయన అడిగారు.. నేను నవ్వాను.. నేను ఏడ్చాను.. అవును అని అరిచాను.. నేను పూర్తిగా మూవీ లవర్ ను.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్లో-మో కలలు, మస్కారా రన్నింగ్.. అతడు చాలా కామ్. నేనే డ్రామా చేస్తా.. ఆయన మేనేజ్ చేస్తారు" అని చెప్పింది.
"ఏదో విధంగా మేం సెట్టవుతాం. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ, అది మ్యాజిక్" అని తెలిపింది. కాగా, హైదరాబాద్ లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికను మిలింద్ తొలిసారి కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ప్రేమ పుట్టాక.. దాదాపు ఐదు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారు.
ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. త్వరలోనే అవిక, మిలింద్ వివాహం జరగనుందని సమాచారం. అందుకు గాను ఇరువురి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లికి సంబంధించిన ప్రకటన ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మిలింద్ ఇంజినీర్ అని సమాచారం. ఎనీ వే కంగ్రాట్స్ మిలింద్- అవిక.
