Begin typing your search above and press return to search.

అతనితో గ్యాప్ వచ్చిందా.. తీసుకున్నారా..?

అష్టాచెమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయమైతే అదే సినిమాతో అవసరాల శ్రీనివాస్ నటుడిగా పరిచయం అయ్యాడు

By:  Tupaki Desk   |   18 March 2024 5:51 AM GMT
అతనితో గ్యాప్ వచ్చిందా.. తీసుకున్నారా..?
X

అష్టాచెమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయమైతే అదే సినిమాతో అవసరాల శ్రీనివాస్ నటుడిగా పరిచయం అయ్యాడు. పొడవాటి మనిషిగా తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన అవసరాల శ్రీనివాస్ తను కేవలం నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేస్తానని చెప్పి సినిమాలు చేస్తున్నాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తున్న అవసరాల శ్రీనివాస్ అభిరుచి గల సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు.

అయితే నానితో తొలి సినిమానే స్క్రీన్ షేర్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్ ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాలు తప్ప మళ్లీ కలిసి నటించింది లేదు. ఇద్దరి దారులు వేరయ్యే సరికి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ మొదట్లో నానితో అవసరాల శ్రీనివాస్ ఫ్రెండ్ షిప్ బాగుండేది కానీ నాని వరుస హిట్లతో స్టార్ అవ్వడం.. యాక్టింగ్ నుంచి అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో బిజీ అవ్వడం వల్ల ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది.

అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నాని హీరోగా సినిమా వస్తుందని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఎదురుచూపులు తప్పట్లేదు. అప్పట్లోనే నానితో సినిమా చేస్తే అది వేరే లెవెల్ లో ఉండాలని చెప్పిన అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు నాని స్టార్ అయ్యాడు కాబట్టి తనకు ఛాన్స్ ఇస్తాడో లేదో అన్న ఆలోచనతో లైట్ తీసుకున్నాడని చెప్పొచ్చు. నటుడిగా, దర్శకుడిగా రెండు విభాగాల్లో అవసరాల శ్రీనివాస్ తన కెరీర్ కొనసాగిస్తున్నాడు.

కెరీర్ మరీ అంత దూకుడుగా లేకపోయినా తనవరకు తాను సాటిస్ఫైడ్ గా ఉన్నానని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. ఆయన కనిపిస్తే చాలు నానిని ఎప్పుడు డైరెక్ట్ చేస్తారన్న ప్రశ్న ఎదురవుతుంది. నాని కి సరిపోయే కథ సిద్ధమైతే తప్పకుండా చేస్తానని చెబుతున్నారు. మరి వీళ్లిద్దరు మళ్లీ ఎప్పుడు కలిసి పనిచేస్తారు. ఇద్దరి మధ్య దూరం దానంతట అదే వచ్చినా లేదా కావాలని తీసుకున్నారా లాంటి విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని కెరీర్ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. హిట్ మీద హిట్ కొడుతూ సక్సెస్ ఫాం కొనసాగిస్తున్నాడు. అందుకే మొన్నటిదాకా బడ్జెట్ విషయంలో అటు ఇటుగా ఉన్న నాని సినిమా ఇప్పుడు మీడియం బడ్జెట్ రేంజ్ అంటే 30 నుంచి 40, 50 కోట్ల దాకా పెట్టేస్తున్నారని తెలుస్తుంది.