Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్ల‌కి ఇదే తెలుగ‌మ్మాయి స‌మాధానం ఇదేనా!

తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరుగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 April 2024 7:08 AM GMT
ట్రోల‌ర్ల‌కి ఇదే తెలుగ‌మ్మాయి స‌మాధానం ఇదేనా!
X

తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరుగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. చేసిన సినిమాల‌కంటే నెట్టింట జ‌రిగిన ట్రోలింగ్ అమ్మ‌డికి కావాల్సినంత గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగు పిల్ల అమెరిక‌న్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడేస‌రికి ఇన్ని తిప్ప‌లుంటాయా? అన్న సంగ‌తి త‌ర్వాత అర్ద‌మైంది. ఇప్ప‌టికే ఆమెపై నెట్టింట జ‌రిగిన ట్రోలింగ్ పై స్పందించ‌డం జ‌రిగింది. కోడ్ స్విచింగ్ అంటే ఏంటో తెలియ‌క వ‌చ్చిన ఇబ్బంది ఇదంతా అని త‌న‌వైపు నుంచి వివ‌ర‌ణ ఇచ్చుకుంది.

అయినా స‌రే అమ్మ‌డిపై ట్రోలింగ్ ఆగ‌లేదు. ఓ సారి అవింతిక సాధించిన విజ‌యాల గురించి చూస్తే! ట్రోల‌ర్ల‌కి దిమ్మ తిరిగిపోవ‌డం ఖాయం అన‌డం స‌బ‌బే. సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా హార్వర్డ్ నుండి ప్రతిష్టాత్మకమైన ప్రశంసలు అందుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి ముందే తెలుగు - తమిళ సినిమాలు చేసింది. తెలుగు లో ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ- ఆమె తెలుగు కమ్యూనిటీకి ఎంతో మద్దతుగా నిలిచింది. తెలుగు భాష ప్రాముఖ్య‌త‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.

ముఖ్యంగా హాలీవుడ్ అడుగులు వేయాల‌నుకునే తెలుగు యువ‌త‌కి అవంత‌క స్పూర్తిగా క‌నిపిస్తుంది. బాలీవుడ్ లో స‌క్సెస్ అయిన ప్రియాంక చోప్రాని స్పూర్తిగా పొంద‌డం కాదు...ఎలాంటి ఫేమ‌స్ కాకుండానే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవంతిక గురించి అంతా ఆలోచించేలా చేసింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి అవంతిక స‌క్సెస్ జ‌ర్నీ ఎంతో స్పూర్తివంత‌మైన‌ది. హార్వర్డ్ ద్వారా సౌత్ ఆసియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఆమె గుర్తింపు పొందడం.. ప్రతికూలత ఉన్నప్పటికీ ఆమె విజయాలు ప్రకాశవంతంగా ఉన్నాయ‌ని చాటి చెప్పింది.

ఆమె వ్య‌తిరేక వ‌ర్గానికి...ట్రోల‌ర్ల‌కు అవంతిక ఎదుగుతోన్న వైనం ఆ రంగంలో రాణించాల‌నే వారిలో స్పూర్తిగా నిలుస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అవంతిక బాల న‌టిగానే కెరీర్ ప్రారంభించింది. `బ్రహ్మోత్సవం`.. `ప్రేమమ్`.. `రారండోయ్ వేడుక చూద్దాం`..` అజ్ఞాతవాసి` లాంటి చిత్రాల్లో న‌టించింది. `స్పిన్` ..`మీన్ గర్ల్స్` లాంటి చిత్రాల‌తోనే హాలీవుడ్ లో గుర్తింపు ద‌క్కించుకుంది.