Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం టు హాలీవుడ్.. అవంతిక సెన్సేషన్

నార్మల్ గా సినిమాల్లో అవకాశాలు చాలా మందికి వస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు

By:  Tupaki Desk   |   14 Jan 2024 10:51 AM GMT
బ్రహ్మోత్సవం టు హాలీవుడ్.. అవంతిక సెన్సేషన్
X

నార్మల్ గా సినిమాల్లో అవకాశాలు చాలా మందికి వస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫేమస్ నటీనటులుగా గుర్తింపు పొందుతుంటారు. ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ స్థాయికి మించి యాక్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో నటించిన ఓ తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ లో అదరగొడుతోంది.


ఆ బ్యూటీ మరెవరో కాదు అవంతిక వందనపు. తెలుగు నేపథ్యం ఉన్న అవంతికకు హాలీవుడ్ ఓటీటీల్లో, సినిమాల్లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇటీవలే అవంతిక మీన్ గర్ల్స్ 2024 అనే హాలీవుడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మీన్ గర్ల్స్ చిత్రంలో కరేన్ శెట్టి క్యారెక్టర్ లో నటించింది అవంతిక. ఈ చిత్రంలో ఆమె నటనకు చాలా ప్రశంసలు వస్తున్నాయి. క్రిటిక్స్ నుంచి కూడా పొగడ్తలు దక్కుతున్నాయి. హాలీవుడ్‍లో లేటెస్ట్ సెన్సేషన్‍ గా మారింది. అసలు ఎవరీమె అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.

తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక వందనపు 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతో పాటు యాక్టింగ్‍లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‍లో 2016లో మహేశ్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం మూవీలో నటించింది. మనమంతా, ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాలు కూడా చేసింది.

ఆ తర్వాత హాలీవుడ్‍కు వెళ్లిపోయింది అవంతిక. మీరా - రాయల్ ఫ్యూచల్ ప్రెసిడెంట్ అనే అమెరికన్ చిత్రంతో హాలీవుడ్‍ లో ఎంట్రీ ఇచ్చింది. డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్, స్పిన్, సీనియర్ ఇయర్ మూవీస్ చేసింది. ఆమెకు ఇప్పుడు మీన్ గర్ల్స్ మూవీతోనే మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హోరోస్కోప్ అనే హాలీవుడ్ హారర్ చిత్రంలో నటిస్తున్న ఆమె చేతిలో మరో సినిమా కూడా ఉంది.

అయితే అవంతికలో మరో టాలెంట్ కూడా ఉంది. ఆమె ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్. పలు వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ కు గాను అవార్డులు అందుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన చిన్నప్పటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ అమ్మాయి ఇలా మారిందంటే నమ్మలేకపోతున్నామని, ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన తెలుగు సినిమాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెను చూస్తే గర్వంగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద మీన్ గర్ల్స్ మూవీతో హాలీవుడ్‍లో టాక్ ఆఫ్ ది టౌన్ గా కూడా మారిపోయింది అవంతిక.