Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసిన తెలుగు అమ్మాయి!

తెలుగు అమ్మాయి అవంతిక మంద‌న ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారిన పేరు. టాలీవుడ్ టూ హాలీవుడ్ కి వెళ్ల‌డంతోనే అమ్మ‌డిపేరు అంత‌గా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 5:46 AM GMT
ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసిన తెలుగు అమ్మాయి!
X

తెలుగు అమ్మాయి అవంతిక మంద‌న ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారిన పేరు. టాలీవుడ్ టూ హాలీవుడ్ కి వెళ్ల‌డంతోనే అమ్మ‌డిపేరు అంత‌గా వెలుగులోకి వ‌చ్చింది. తొలుత టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారం భించిన సంగ‌తి తెలిసిందే. `బ్రహ్మోత్సవం` .. `కృష్ణగాడి వీర ప్రేమ గాధ`.. `ప్రేమమ్`.. `అజ్ఞాతవాసి`.. `రారండోయ్ వేడుక చూద్దాం` లాంటి సినిమాల్లో న‌టించింది. అటుపై ఒక్క‌సారిగా కనుమరుగైంది.


ఇటీవ‌లే ఏకంగా హాలీవుడ్ చిత్రం `మీన్ గర్ల్స్` లో న‌టించ‌డం..అది హిట్ అవ్వ‌డంతో అవంతిక పేరు మ‌ళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సినిమాలు తీసుకు రాని గుర్తింపును ఒక్క హాలీవుడ్ సినిమా తీసుకొచ్చింది. ఇందులో అమ్మ‌డి పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇదేమి అవంతిక‌కు హాలీవుడ్ లో డెబ్యూ కాదనుకోండి. అంత‌కుముందు కొన్ని సినిమాలు..సిరీస్ లు చేసింది.

కానీ `మీన్ గ‌ర్ల్స్` తోనే ఫేమ‌స్ అయింది. ఇంత ఫేమ‌స్ అయిన బ్యూటీ ఓ ఫుడ్ రెస్టారెంట్ లో ప‌నిచేస్తూ క‌నిపించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. క‌స్ట‌మ‌ర్ల నుంచి ఆర్డ‌ర్ తీసుకుని ఫుడ్ స‌ర్వ్ చేస్తుంది. వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ న‌టి ఫుడ్ స‌ర్వ్ చేయ‌డం ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కానీ ఇదంతా రెస్టారెంట్ తో త‌న‌కున్న బాండింగ్ కార‌ణంగా అని తెలుస్తుంది. గ‌తంలో ఆమె రెస్టా రెంట్ లో పనిచేసిన రెస్టారెంట్ లా ఉంది అది.

ఇప్పుడామెకి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పడంతోనే మ‌రోసారి పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా అవంతిక స్పందించింది. `మీరు ఇచ్చిన విజయాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నా మీద ప్రేమ చూపిస్తున్నారు` అంటూ చెప్పుకొచ్చింది. దీనికి చిత్ర బృందంలో వ్య‌క్తి బ‌ధులిస్తూ.. `నువ్వు రైజింగ్ స్టార్‌వి. నీవు ఇంకా పెద్ద స్థాయికి ఎదగడం నేను చూస్తాను` అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. నెటి జ‌నుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.