Begin typing your search above and press return to search.

అవంతిక… గ్లామర్ డోస్ అంతకుమించి..

అవంతిక వందనపు.. ఇప్పుడు ఇండియన్ వైడ్ గా ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:49 AM GMT
అవంతిక… గ్లామర్ డోస్ అంతకుమించి..
X

అవంతిక వందనపు.. ఇప్పుడు ఇండియన్ వైడ్ గా ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవంతిక ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈమె గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. అమెరికన్ యాక్సెంట్ లో గలగల మాట్లాడుతూ అదరగొడుతున్న ఈ చిన్నది అచ్చు తెలుగు అమ్మాయి. అయితే ఇప్పుడు హాలీవుడ్ లో నటిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది.


తాజాగా హాలీవుడ్ లో మీన్ గర్ల్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అవంతిక లీడ్ రోల్ లో నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అవంతిక చేసిన సందడితో ఒక్కసారిగా వైరల్ గర్ల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె గురించి తెలుసుకోవడం మొదలెట్టారు.


ఈ చిన్నది చైల్డ్ యాక్టర్ గా టాలీవుడ్ లో ఉన్న కెరియర్ స్టార్ట్ చేసింది. బ్రహ్మోత్సవం సినిమాతో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అవంతిక మనమంతా, ప్రేమమ్, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, లాంటి సినిమాలలో నటించింది. మీరా రాయల్ డిటెక్టివ్ అనే సిరీస్ తో హాలీవుడ్ లోకి అవంతిక ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.


ఇక ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అవంతిక తన గ్లామర్ ఫోటోలని రెగ్యులర్ గా షేర్ చేస్తోంది. అదిరిపోయే లుక్స్, హాట్ ఫోజులుతో కట్టిపడేస్తోంది. రీసెంట్ గా అమ్మడు బ్లాక్ గ్లామరస్ డ్రెస్సులో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. చూస్తుంటే అమ్మడు రాబోయే రోజుల్లో మరీంత డోస్ పెంచేలా కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలలో కూడా అవంతికని హీరోయిన్ గా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిన్నది ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్ తో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. దీంతో ఆ యాడ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్పిన్, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్ మూవీస్ తో ఆకట్టుకుంది. ఆమె నటించిన హారస్కోప్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఏ క్రౌన్ ఆఫ్ విషెస్ అనే హాలీవుడ్ సిరీస్ లో కూడా అవంతిక లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇలా జెట్ స్పీడ్ తో హాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ భూమిక అనే తమిళ్ మూవీలో కీలక పాత్రలో చివరిగా నటించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగిపోయారు.