Begin typing your search above and press return to search.

న‌టి కం ఎన్నారై గాళ్ అవంతిక విశ్వ‌రూపం

అవంతిక వందనపు.. ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి. కానీ ఇప్పుడు హాలీవుడ్ లో రైజింగ్ స్టార్

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:47 PM GMT
న‌టి కం ఎన్నారై గాళ్ అవంతిక విశ్వ‌రూపం
X

అవంతిక వందనపు.. ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి. కానీ ఇప్పుడు హాలీవుడ్ లో రైజింగ్ స్టార్. అంత‌కుముందే ఈ అమ్మాయి త‌న ఫేవ‌రెట్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి 'బ్ర‌హ్మోత్స‌వం' (2016)లో న‌టించింది. అప్ప‌టికి అవంతిక టీనేజ‌ర్. టాలీవుడ్‌లో బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభమైంది. హాలీవుడ్ లో టీనా ఫే 'మీన్ గర్ల్స్ 2024 రీబూట్‌'లో న‌టించింది.


ఇప్పుడు మీన్ గ‌ర్ల్ లో త‌న పాత్ర గురించి యువ‌త‌రంలో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌లోనే పాపుల‌ర్ హాలీవుడ్ మ్యాగజైన్లు ఈ అమ్మ‌డి ఫోటోషూట్ల కోసం వెంట‌ప‌డుతున్నాయి. తాజాగా ప్ర‌ఖ్యాత పాలిస్ట‌ర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం అవంతిక ఇచ్చిన ఫోజులు వేడి పెంచుతున్నాయి. ఇన్నాళ్లు చిన్నారి చిట్టి పొట్టి అమ్మాయిగా క‌నిపించిన అవంతిక ఇప్పుడు టీనేజీ గాళ్ గా ఎంతో బ్యూటిఫుల్ గా మారింది. త‌న‌దైన అందం హొయ‌లుతో మ‌తులు చెడ‌గొడుతోంది. అవంతిక రెండు జెడ‌లు క‌వ్విస్తున్నాయి. మోడ్ర‌న్ గా క‌నిపిస్తూనే ట్రెడిష‌న్ ని జోడించిన డిజైన‌ర్ లుక్ తో ఈ తెలుగ‌మ్మాయి ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా అవంతిక టీజింగ్ యాటిట్యూడ్ బోయ్స్ కి క‌నెక్ట‌యిపోతోంది. హాలీవుడ్‌కు ఇష్టమైన డిట్జ్ ఈజ్ బ్యాక్ .. అవంతిక మీన్ గర్ల్స్ గురించి, బ్రౌన్ బింబో ప్లే చేయడంపైనా.. సెల్యులాయిడ్‌లో ఆమె దశాబ్దం కెరీర్ గురించి స‌ద‌రు మ్యాగ‌జైన్ తో ముచ్చ‌టించింది.


నిజానికి అవంతిక ఇంత‌కుముందే త‌న ఆసక్తుల గురించి ప్ర‌ముఖ తెలుగు మీడియాకు వెల్ల‌డించింది. పాపుల‌ర్ తెలుగు పోర్టల్‌తో మాట్లాడిన ఈ బ్యూటీ .. తాను మహేష్‌ని అభిమానిస్తూ పెరిగానని చెప్పింది. టాలీవుడ్‌లో మహేష్‌తో నాకు మొదటి అవకాశం రావడం అనేది క‌ల నెర‌వేర‌డ‌మే. భారతదేశంలో, ముఖ్యంగా నా మాతృభాషలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేయడం, చిన్నతనంలో న‌టిగా కంఫ‌ర్ట్ అవ్వ‌డానికి సహాయపడింది. ఈ చిత్రంలో అవంతిక మహేష్ చిన్న కోడలుగా నటించింది.

టాలీవుడ్, బాలీవుడ్‌లో తాను ఎక్కడ పని చేయాలనుకుంటోంది? దర్శకుల చెక్‌లిస్ట్ గురించి కూడా తెలిపింది. అవంతిక‌ మాట్లాడుతూ ''రాజమౌళి, సంజయ్ లీలా భ‌న్సాలీ, శేఖర్ కమ్ముల, విధు వినోద్ చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. తమ సినిమాల్లో స్త్రీలను శక్తివంతంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా ప్రదర్శించే ప్రతిభ వీరికి ఉంది. వారు రాసే పాత్రలలో నేను ఒక‌రిగా ఉండాలనుకుంటున్నాను'' అని అన్నారు.

అవంతిక న‌టించిన 'మీన్ గర్ల్స్' జనవరి 9న అమెరికాలో విడుదలైంది. అవంతిక కరెన్ శెట్టి పాత్రను పోషించింది. 2004లో వ‌చ్చిన ఒరిజిన‌ల్ చిత్రం నుండి కరెన్ స్మిత్‌కు రీకాలింగ్ రోల్ ఇది. ఈ చిత్రంలో అంగోరీ రైస్, రెనీ రాప్, ఔలీ క్రావాల్హో, క్రిస్టోఫర్ బ్రినీ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కేవలం టీనా ఫే మునుపటి చిత్రం ఆధారంగా కాకుండా రోసలిండ్ వైజ్‌మాన్ రాసిన క్వీన్ బీస్ అండ్ వాన్నాబెస్ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. ఇది కాకుండా అవంతిక టారో అనే హార‌ర్ చిత్రంలోను న‌టిస్తోంది. BGDC అనే ప్రైమ్ వీడియో షో లోను క‌నిపించ‌నుంది.