Begin typing your search above and press return to search.

కునుకులేకుండా చేస్తున్న బ్రహ్మోత్సవం బ్యూటీ..!

తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని రకాలు ఫోటోలు షేర్ చేసిన ఈమె అందులో గ్లామర్ వలకబోస్తూ హీరోయిన్ పీస్ అంటూ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   1 Dec 2025 10:04 AM IST
కునుకులేకుండా చేస్తున్న బ్రహ్మోత్సవం బ్యూటీ..!
X

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరైనా సరే ఈ గ్లామర్ ప్రపంచంలో నెట్టుకు రావాలి అంటే తమ అందంతో కూడా ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందంతో, నటనతో మెప్పించినప్పుడే వారికి అవకాశాలు కూడా లభిస్తాయి. సినిమాలలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకోవాలి. అందులో భాగంగానే రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో దర్శనం ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సెలబ్రిటీలు.





అలా ఇప్పటికే యంగ్ హీరోయిన్స్ ను మొదలుకొని సీనియర్ హీరోయిన్స్ వరకు ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు కూడా తామేమి తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు. ఇప్పటికే దృశ్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎస్తేర్ అనిల్ ఇప్పుడు గ్లామర్ వొలకబోస్తూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి మహేష్ బాబు, సమంత కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నేర్పించి, అందరి హృదయాలు దోచుకున్న ఎన్నారై నటి అవంతిక కూడా చేరిపోయింది.





తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని రకాలు ఫోటోలు షేర్ చేసిన ఈమె అందులో గ్లామర్ వలకబోస్తూ హీరోయిన్ పీస్ అంటూ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటోంది. మొత్తానికైతే అవంతిక ఒకవైపు కిచెన్ లో మరొకవైపు సోఫాలో ఫోటోలకు ఫోజులిస్తూ తన అందంతో అభిమానులకు కునుకులేకుండా చేస్తోంది.





అవంతిక విషయానికి వస్తే.. అవంతిక అసలు పేరు అవంతిక వందనపు. ఈమె నటి మాత్రమే కాదు.. డాన్సర్ కూడా.. సింగర్ , మోడల్, సంధాన కర్తగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. కాలిఫోర్నియాలో భారత సంతతికి జన్మించింది. 2014లో జరిగిన జీటీవీ రియాలిటీ షో "డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికా"లో తన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఈమె.. ఈ షోలో రెండవ విజేతగా నిలిచి మంచి పేరు దక్కించుకుంది. ఐదేళ్ల వయసులోనే డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈమె.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ వంటి డాన్సులు అన్నీ కూడా నేర్చుకుంది. అంతేకాదు చక్కగా బొమ్మలు కూడా గీస్తుంది అవంతిక.

టీవీ యాడ్స్ ద్వారా కూడా మరింత పాపులారిటీ అందుకున్న ఈమె తొలిసారి బ్రహ్మోత్సవం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి చిత్రమైన మనమంతాలో నటించిన ఈమె.. గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో ఒక పాటలో ఒక చిన్న పాత్ర పోషించింది. అలాగే నాగచైతన్య , శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.