ఆగస్టు బాక్సాఫీస్.. ఎలా ఉండబోతోంది?
2025లో ఏడు నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
By: M Prashanth | 1 Aug 2025 6:45 PM IST2025లో ఏడు నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. చాలా సినిమాలు ఫ్లాప్ గానే నిలిచాయి. ఇప్పుడు ఆగస్టులో వివిధ చిత్రాలు.. థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో బయ్యర్స్.. అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఏఏ సినిమాలు రానున్నాయంటే?
సార్ మేడమ్ సినిమాతో ఆగస్టు నెల క్రేజీగా స్టార్ట్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన ఆ మూవీ ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో సందడి చేస్తోంది. అదే సమయంలో నిన్న విజయ్ కింగ్ డమ్ రిలీజ్ అవ్వగా.. అది కూడా థియేటర్స్ లో రాణిస్తోంది.
వాటితోపాటు రెండు సినిమాలు ఉసురే, థాంక్ యు డియర్ థియేటర్స్ లోకి వచ్చాయి. బాలీవుడ్ మూవీస్ సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 కూడా రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చే వారం ఆగస్టు 8వ తేదీన బకాసుర రెస్టారెంట్ సినిమా రానుంది. ఇప్పటికే ఆడియన్స్.. ప్రమోషన్స్ వెరైటీగా చేస్తున్నారు. అంతకుముందు రోజు మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ అతడు రీ రిలీజ్ కానుంది.
ఇక ఆగస్టు 14వ తేదీ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనుంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2 గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.. తెలుగులో స్ట్రయిట్ మూవీకి దీటుగా విడుదల చేయనుంది. అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆడియన్స్ లో రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఆగస్టు 22వ తేదీన పరదా సినిమా రానుంది. టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అదే రోజు నరేష్ అగస్త్య నటిస్తున్న మేఘాలు చెప్పిన ప్రేమకథ మూవీ విడుదల అవ్వనుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా స్టాలిన్ 4కే వెర్షన్ సందడి చేయనుంది.
ఆ తర్వాత చివరి వారంలో మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర.. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ లేదు. నారా రోహిత్ సుందరకాండ సినిమా మాత్రం విడుదల అవ్వడం ఖాయం. అక్కడికి రెండు రోజుల తర్వాత స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీటా రివాల్వర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ పరం సుందరి కూడా రిలీజ్ అవ్వనుంది. మరి ఆ సినిమాలన్నీ ఎలాంటి విజయం సాధిస్తాయో వేచి చూడాలి.
