Begin typing your search above and press return to search.

రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ్‌లో ఖాన్‌ల త్ర‌యం?

సింగం సిరీస్ సినిమాల‌తో పాటు, ఇప్పుడు ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో మ‌రో భారీ సిరీస్ ని తెర‌కెక్కించాడు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:22 PM GMT
రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ్‌లో ఖాన్‌ల త్ర‌యం?
X

ప‌వ‌ర్ ఫుల్ కాప్ సినిమాల‌తో సంచ‌ల‌నం సృష్టించ‌డంలో రోహిత్ శెట్టికి ఉన్న ట్రాక్ రికార్డ్ అసాధార‌ణ‌మైన‌ది. కొన్ని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో పోలీస్ పాత్ర‌ల‌తో అద్భుతాలు చేసాడు శెట్టి. సింగం సిరీస్ సినిమాల‌తో పాటు, ఇప్పుడు ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో మ‌రో భారీ సిరీస్ ని తెర‌కెక్కించాడు. ఈ సిరీస్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.

ఇంత‌లోనే రోహిత్ శెట్టి ఈ ప్రతిష్టాత్మక `కాప్ విశ్వం`లో భాగమైన పాత్రలను ఆవిష్కరించడంలో బిజీగా ఉన్నాడు. అనేక తరాల సూపర్‌స్టార్‌లను కాప్ విశ్వంలో చేర్చుతున్న శెట్టి సింగం, సింబా, సూర్యవంశీ లాంటి కాప్ డ్ర‌మాల‌ను తెర‌కెక్కించారు. ఇప్పుడు `ఇండియన్ పోలీస్ ఫోర్స్‌` ప్ర‌చారంలో పోలీసు వర్క్ ఫోర్స్ సాధించిన విజయాలను సెల‌బ్రేట్ చేయ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకుప‌న్నారు. త‌దుప‌రి ఖాన్ ల త్ర‌యం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల‌తో కాప్ విశ్వంలో సినిమా తీయాల‌నుంద‌ని రోహిత్ శెట్టి తన కోరికను వెల్లడించాడు.

ఇండియన్ పోలీస్ ఫోర్స్‌ను ప్రమోట్ చేస్తున్న రోహిత్ శెట్టిని అభిమానులు కాప్ విశ్వం విస్త‌ర‌ణ‌ గురించి అడిగారు. ఇద్దరు సూపర్ స్టార్లు అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్‌లతో పాటు రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, కరీనా కపూర్ ఖాన్, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్ ఇప్పటికే ఇందులో న‌టించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లేదా అమీర్ ఖాన్ ఫ్రాంచైజీలోకి వ‌స్తున్నారా? అనే ప్ర‌శ్న‌కు స్పందిస్తూ, తన‌కు ఇలా ఎంపిక చేసుకోవడం ఇష్టం లేదని, అయితే వారు ముగ్గురూ అందులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

ఇంత‌లో స‌ద‌రు అభిమాని, ఖాన్‌లను ఒకచోట చేర్చే ఈ కల కోసం శెట్టి ఇప్పటికే పని ప్రారంభించారా? అంటూ ప్ర‌వ్న‌ల్ని ఎదుర్కొన్నాడు. దానికి అతడు ``ఆరామ్ ఆరామ్ సే. బహుత్ టైమ్ హై, అభి పూరీ ఇండస్ట్రీ కో కాప్ బనా దేంగే. తు టెన్షన్ మత్ లే… కోయి నహీ బచేగా! ఏక్ హుమారా అలాగ్ సే పోలీస్ ఫంక్షన్ హోగా (నెమ్మదిగా, నెమ్మదిగా. మాకు చాలా సమయం ఉంది. పరిశ్రమ మొత్తం ఈ కాప్ ప్రపంచంలో భాగం కావాలని మేము కోరుకుంటున్నాము. చింతించకండి.. నేను ఎవరినీ విడిచిపెట్టాలని కోరుకోను. మేము చేస్తాము.. ప్రత్యేక పోలీసు విధిని కలిగి ఉండండి).`` అని వ్యాఖ్యానించాడు.

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్‌లు ఇప్పటికే వరుసగా సింగం, సూర్యవంశీ, సింబా, అవనీ బాజీరావ్ సింగంగా పరిచయం కాగా, సింగం ఎగైన్ లో శక్తి శెట్టిగా దీపికా పదుకొణె ,ACP సత్యగా టైగర్ ష్రాఫ్‌ను పరిచయం చేయనున్నారు. మరోవైపు సీనియర్ ఇన్‌స్పెక్టర్ కబీర్ మాలిక్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా, గుజరాత్ ఏటీఎస్ చీఫ్ తారా శెట్టిగా శిల్పాశెట్టి, జాయింట్ కమిషనర్ విక్రమ్ బక్షిగా వివేక్ ఒబెరాయ్ `భారత పోలీస్ ఫోర్స్‌` సిరీస్ లో పరిచయం కానున్నారు.