Begin typing your search above and press return to search.

అట్లీ.. ఆ ముగ్గురు హీరోల్లో ఫస్ట్ ఎవరో

అట్లీ తర్వాత చేయబోయే హీరోల లిస్ట్ లో విజయ్ దళపతి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:44 AM GMT
అట్లీ.. ఆ ముగ్గురు హీరోల్లో ఫస్ట్ ఎవరో
X

రాజా రాణి, అదిరింది, తేరి, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అట్లీ.. ఇప్పుడు కింగ్ షారుక్ ఖాన్ తో జవాన్ తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. సెప్టెంబర్ 7న రిలీజై.. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో జర్నీ స్టార్ట్ చేసిన జవాన్.. సరికొత్త రికార్డులను సెట్ చేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు దర్శకుడు అట్లీ రేంజ్ మరింత పెరిగిపోయింది. అప్పుడే తన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి కూడా సినీ ప్రియుల్లో భారీగా నెలకొంది.

అలాగే అట్లీ నెక్ట్స్ లైనప్ గురించి కూడా టాక్ వినిపిస్తోంది. అట్లీ తర్వాత చేయబోయే హీరోల లిస్ట్ లో విజయ్ దళపతి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వీరందరికీ స్టోరీ లైన్ కూడా చెప్పారని, చర్చలు జరిగాయని అంటున్నారు. హీరోలకు కూడా ఆ స్టోరీ లైన్స్ బాగానే నచ్చాయట.

కానీ ఇప్పుడు ఈ హీరోలంతా ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే లియోతో రానున్న దళపతి విజయ్.. ఆ తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నారు.

దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత హృతిక్ రోష్ న్ తో వార్ 2, ప్రశాంత్ నీల్ తో చిత్రాలను చేయనున్నారు. ఇక పుష్ప 2 బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తర్వాత సందీప రెడ్డి వంగా, త్రివిక్రమ్​ తో సినిమాలను అనౌన్స్ చేశారు.

ఈ హీరోలకు ఈ చిత్రాలన్ని పూర్తి కావడానికి చాలా సమయమే పడుతుంది. లేదంటే తమ కొత్త సినిమాల షూటింగ్ ప్రారంభించకముందే అట్లీతో సినిమా చేసేందుకు కూడా రెడీ అవ్వొచ్చు. అయితే విజయ్ దళపతి- వెంకట్ ప్రభూ సినిమా మాత్రం తక్కువ సమయమే పట్టొచ్చు. వెంకట్ ప్రభు త్వరగానే షూట్ పూర్తి చేస్తారు.. పైగా విజయ్ లైనప్ లో కూడా ఈ ఒక్క సినిమానే ఉంది.

దిగ్గజ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తారని ఆ మధ్యలో వార్తలు వచ్చినా దానిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ హీరోల్లో అట్లీకి ఎవరు ముందుగా డేట్స్ ఇస్తారో... అప్పుడే అందుకు తగ్గట్టు ఓ కథను పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని.. వారితో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అవుతారని తెలుస్తోంది.

ఇక అట్లీ షారుక్ జవాన్ విషయానికొస్తే.. ప్రస్తుతం అదరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు సినీ ప్రియులు, అభిమానులు క్యూలు కడుతున్నారు. సినిమా కథ, షారుక్ మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటన్నారు. ఈ విజయంతో అటు అట్లీ, ఇటు షారుక్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో..