Begin typing your search above and press return to search.

అట్లీ VS సందీప్‌.. ఆ సౌత్‌ రికార్డ్‌ ఎవరికి

కానీ అట్లీ ఇక్కడి నుంచి వెళ్లి షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్ సినిమాను తెరకెక్కించి ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 Nov 2023 3:30 PM GMT
అట్లీ VS సందీప్‌.. ఆ సౌత్‌ రికార్డ్‌ ఎవరికి
X

సౌత్ దర్శకులు బాలీవుడ్‌ లో సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక వేళ మన దర్శకులు అక్కడకు వెళ్లి చేసినా కూడా పెద్ద విజయాలు, రికార్డ్‌ లు నమోదు అవ్వడాలు జరగలేదు. కానీ అట్లీ ఇక్కడి నుంచి వెళ్లి షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్ సినిమాను తెరకెక్కించి ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.

జవాన్‌ కి ముందు కబీర్ సింగ్ సినిమా తో సందీప్ వంగ కూడా బాలీవుడ్‌ లో కమర్షియల్‌ గా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు యానిమల్‌ సినిమాతో మరో సెన్షేషనల్‌ బ్లాక్ బస్టర్‌ విజయం దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు. యానిమల్ సినిమా సౌత్ లో కూడా భారీ గా విడుదలకు రెడీ అవుతోంది.

హిందీ జవాన్ సినిమా సౌత్ ఇండియాలో దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు సందీప్ వంగ నుంచి రాబోతున్న యానిమల్‌ సినిమా కచ్చితంగా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కలిపి కచ్చితంగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. దాంతో సౌత్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేయబోతున్న హిందీ సినిమా గా యానిమల్ నిలువబోతుంది.

అట్లీ హిందీ సినిమా రూ.150 కోట్లు వసూళ్లు చేస్తే.. ఇప్పటి వరకు అదే రికార్డ్ గా ఉంది. ఒక హిందీ సినిమా అత్యధిక వసూళ్లు సౌత్‌ లో నమోదు చేయడం జవాన్ కే సాధ్యం అయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ కచ్చితంగా యానిమల్‌ పేరు పైకి షిప్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు.

సౌత్‌ దర్శకులు అట్లీ మరియు సందీప్ వంగలు బాలీవుడ్‌ లో ఈ రేంజ్ లో కుమ్మేయడం గర్వకారణం. ముందు ముందు వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది హిందీ సినిమాలు చేసేందుకు సౌత్ నుంచి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.