Begin typing your search above and press return to search.

అట్లీ రేంజ్.. అట్లుంటది మరి!

బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా జవాన్ నిలిచింది.

By:  Tupaki Desk   |   4 March 2024 10:30 AM GMT
అట్లీ రేంజ్.. అట్లుంటది మరి!
X

రాజారాణి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి తరువాత వరుస కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అట్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన అట్లీ గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ సినిమా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా జవాన్ నిలిచింది.

ఈ సినిమా తర్వాత అట్లీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా అట్లీతో మూవీ చేయాలని ఎదురుచూస్తున్నారు. తన కోసం కథ రెడీ చేయమని సల్మాన్ ఖాన్ ఇప్పటికే అట్లీకి సూచించారంట. ఆ పనిలో అట్లీ ఉన్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప2 తర్వాత ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ కి స్టోరీలైన్ నేరేట్ చేసాడని, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే అనీల్ అంబానీ కొడుకు పెళ్లికి సౌత్ నుంచి అతికొద్ది మంది స్టార్స్ కి ఆహ్వానం అందింది. వారిలో అట్లీ కూడా ఉన్నారు.

తన భార్యతో కలిసి అట్లీ ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. వేడుకలో రణవీర్ సింగ్ అట్లీని అందరికి పరిచయం చేస్తూ బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు ఇతడితో మూవీస్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారని తనదైన శైలిలో ఫన్నీగా తెలిపాడు. దీనిని బట్టి అట్లీ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రణవీర్ సింగ్ సైతం అట్లీతో మూవీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు అతని మాటల బట్టి తెలుస్తోంది.

కమర్షియల్ డైరెక్టర్ గా అట్లీకి మంచి ఇమేజ్ ఉంది. సోషల్ ఎలిమెంట్ ని తీసుకొని దానిని బలమైన హీరో క్యారెక్టరైజేషన్ తో రిప్రజెంట్ చేస్తాడు. అలాగే హీరో ఎలివేషన్స్ కూడా అతని సినిమాలలో అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే బాలీవుడ్ స్టార్స్ అట్లీతో మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్స్ కూడా అట్లీ కోసం వెయిట్ చేస్తున్నారు.