Begin typing your search above and press return to search.

నేను ఆ మల్టీస్టారర్ చేస్తే రూ.3 వేల కోట్ల కలెక్షన్స్‌ ఖాయం

కనుక ఈసారి వారిద్దరిని కలిపి ఒక సినిమాలో చూపించాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలియజేసి అందరిలో ఆసక్తిని పెంచాడు

By:  Tupaki Desk   |   7 Oct 2023 11:46 AM GMT
నేను ఆ మల్టీస్టారర్ చేస్తే రూ.3 వేల కోట్ల కలెక్షన్స్‌ ఖాయం
X

తమిళ్‌ దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు కొన్నే కానీ ప్రతి ఒక్క సినిమా కూడా వందల కోట్ల వసూళ్లు సాధించి రికార్డుల మోత మ్రోగించాయి. తాజాగా బాలీవుడ్‌ లో షారుఖ్ ఖాన్‌ తో అట్లీ రూపొందించిన జవాన్‌ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసి ఇంకా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. ఈ వీకెండ్‌ కి జవాన్ భారీగానే వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఒక వైపు జవాన్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద దండ యాత్ర కొనసాగిస్తున్న సమయంలో మరో వైపు దర్శకుడు అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మల్టీస్టారర్ సినిమా విషయంలో అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు.. అట్లీ సరదాగా అన్నా కూడా ఆ మాటలు నిజం అయితే బాగుండు అనుకుంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అట్లీ ని విజయ్‌, షారుఖ్ ఖాన్‌ లలో ఎవరిని ఎంపిక చేసుకుని మళ్లీ సినిమా చేయాలి అనుకుంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం చెప్పాడు. అట్లీ ఇద్దరితో కూడా గతంలో వర్క్ చేశాడు. కనుక ఈసారి వారిద్దరిని కలిపి ఒక సినిమాలో చూపించాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలియజేసి అందరిలో ఆసక్తిని పెంచాడు

షారుఖ్‌ ఖాన్‌ తో రూపొందించిన జవాన్‌ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కనుక షారుఖ్‌ ఖాన్‌ మరియు విజయ్ లతో నేను మల్టీ స్టారర్ సినిమాను రూపొందిస్తే అది కచ్చితంగా రూ.3 వేల కోట్ల వసూళ్లను నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కాంబినేషన్‌ సాధ్యమేనా అంటే డౌటే అన్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

అట్లీ దర్శకత్వంలో ఎంతటి పెద్ద స్టార్‌ హీరో అయినా ఎలాంటి కండిషన్ పెట్టకుండా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా ఉన్నాడు. కనుక ముందు ముందు విజయ్ మరియు షారుఖ్‌ ఖాన్‌ లకు సెట్‌ అయ్యే కథను తీసుకు వస్తే వారిద్దరు కూడా నో చెప్పకుండా ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మూడు వేల కోట్ల వసూళ్లు సాధ్యమా అంటే కష్టమే అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న థియేటర్ల పరిస్థితుల నేపథ్యంలో వెయ్యి కోట్ల వసూళ్లు రావడం చాలా గొప్ప విషయం అని.. మూడు వేల కోట్ల సినిమా అంటూ అట్లీ చేసిన వ్యాఖ్యలు కాస్త అతిగానే అనిపిస్తున్నాయి అంటూ సోషల్‌ మీడియా ద్వారా కొందరు మీమర్స్ కామెంట్స్ చేస్తున్నారు.