Begin typing your search above and press return to search.

అట్లీ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు!

అప్పుడే నువ్వు ఇద్ద‌రు హీరోల‌తో ఏదైనా సినిమా చేయాల‌నుకుంటే చెప్పు మేము ఇద్ద‌రం చేస్తాం అని షారుక్ అన్నారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:30 PM GMT
అట్లీ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు!
X

'జ‌వాన్' హిట్ తో షారుక్-అట్లీ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. షారుక్ స్టార్ డ‌మ్..అట్లీ మాస్ అప్పిరియ‌న్స్ తో 700 కోట్ల వ‌సూళ్ల‌ని సునాయాసంగా కొల్ల‌గొట్టింది. దీంతో షారుక్ మ‌ళ్లీ అట్లీతో సినిమా ఎప్పుడు చేద్దామా? అని చూస్తున్నాడు అని అంతా అనుకుంటున్నారు. కానీ అట్లీతో మ‌రో సినిమా చేయాలని జ‌వాన్ సెట్స్ లో డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా షారుక్- త‌ల‌ప‌తి విజ‌య్ తో అట్లీ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతం ఆ క‌థ ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసాడు. వాస్త‌వానికి ఈ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని చాలా రోజులగా వార్త‌లొస్తున్నాయి. కానీ ఇంత కాలం అన్ని విని మౌనంగా ఉన్న అట్లీ మాత్రం ఇక ఆ మౌనాన్ని అదుపు చేయ‌లేక ఓపెన్ అయ్యాడు. 'చెన్నైలో జిందా బందా పాట చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో విజ‌య్ అన్న‌ని మా పార్టీకి ఆహ్వానించాను.

ఆ స‌మ‌యంలో షారుక్..విజ‌య్ క‌లిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. అప్పుడే నువ్వు ఇద్ద‌రు హీరోల‌తో ఏదైనా సినిమా చేయాల‌నుకుంటే చెప్పు మేము ఇద్ద‌రం చేస్తాం అని షారుక్ అన్నారు. విజ‌య్ అన్న కూడా దానికి ఒప్పుకున్నారు. దీంతో నా ఆనందానికి అవ‌దుల్లేవ్. ఇద్ద‌రు స్టార్ హీరోల్ని ఒకే ప్రేమ్ లో చూపించే అవకాశం నాకు దక్కింద‌ని ఆస‌మ‌యంలో మ‌న‌సులో చాలా సంతోష ప‌డ్డాను.

అందుకే ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని క‌థ ప‌నులు కూడా మొద‌లు పెట్టాను. ఇద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు క‌థ ఉండేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నా. బ‌హుశా నేను చేయ‌బోయే త‌దుప‌రి సినిమా ఇదే అవుతుంది' అని అట్లీ స‌ర్ ప్రైజ్ చేసాడు. ఇది నిజంగా ఊహించ‌నిది. ఇద్ద‌రితో మ‌ల్టీస్టార‌ర్ అని ప్ర‌క‌ట‌న ఇచ్చిన ఇప్పుడ‌ప్పుడే జ‌రిగేది కాద‌నుకుంటాం. కానీ అట్లీ మాత్రం ఆల‌స్యం అమృతం విషం అన్న చందంగా షారుక్-విజ‌య్ రెడీ అన‌డంతో క‌థ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు.