Begin typing your search above and press return to search.

మరో ఇద్దరు సూపర్ స్టార్స్ లైన్‌ లో ఉన్నారన్న దర్శకుడు..!

దర్శకుడిగా మొదటి సినిమా చేసి దశాబ్ద కాలం అయినా కూడా ఇప్పటి వరకు దర్శకుడు అట్లీ నుంచి వచ్చిన సినిమాలు అయిదు మాత్రమే

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:30 PM GMT
మరో ఇద్దరు సూపర్ స్టార్స్ లైన్‌ లో ఉన్నారన్న దర్శకుడు..!
X

దర్శకుడిగా మొదటి సినిమా చేసి దశాబ్ద కాలం అయినా కూడా ఇప్పటి వరకు దర్శకుడు అట్లీ నుంచి వచ్చిన సినిమాలు అయిదు మాత్రమే. ఆయనకి ఉన్న క్రేజ్‌ మరియు ఆయన పట్ల స్టార్‌ హీరోలు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో ఏడాదికి రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు చేసేంత సత్తా, స్టామినా ఆయనకు ఉంది. కానీ అలా చేయకుండా మెల్లగా మాత్రమే సినిమాలు చేస్తాడు అట్లీ.

చేసిన అయిదు సినిమాల్లో మూడు సూపర్ స్టార్‌ విజయ్‌ తో కాగా, ఒకటి బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తో అనే విషయం తెల్సిందే. ఇక మరో సినిమా లేడీ సూపర్ స్టార్‌ నయనతార తో అట్లీ చేయడం జరిగింది. ఇలా తన అన్ని సినిమాలను కూడా సూపర్‌ స్టార్స్ తో చేసిన అట్లీ మరో ఇద్దరు సూపర్‌ స్టార్స్ ని లైన్‌ లో పెట్టాడట.

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రజినీకాంత్‌, అట్లీ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా అట్లీ ఈ విషయాన్ని తెలియజేశాడు. చిన్నప్పటి నుంచి కూడా రజినీ సర్‌ కి నేను అభిమాని. అందుకే ఆయనతో సినిమా చేయాలని ఆశ.

రజినీ సర్‌ కూడా కలిసిన ప్రతి సారి కూడా కథ రెడీ చేయి సినిమా చేద్దాం అంటూ ఉంటారు. ఆయన కోసం కథ ను రెడీ చేశాను. తప్పకుండా మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని అట్లీ ప్రకటించాడు. ఇక అట్లీ మరో సూపర్‌ స్టార్‌ అజిత్‌ కుమార్‌ కి కూడా కథ ను చెప్పాడట.

ఆ కథ విషయంలో అజిత్‌ కూడా పాజిటివ్ గా రియాక్ట్‌ అయ్యాడట. కనుక అజిత్‌ తో కూడా అట్లీ ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. జవాన్ సినిమా తర్వాత బాలీవుడ్‌ లో అట్లీ పై ఆసక్తి బాగా పెరిగింది. ఇక టాలీవుడ్‌ హీరోలు కూడా అట్లీ తో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు.

అట్లీ తదుపరి సినిమా హిందీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరితో, ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఇప్పటినుంచైనా అట్లీ ఏడాదికి కనీసం ఒక్క సినిమా చొప్పున చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.