Begin typing your search above and press return to search.

సుకుమార్‌, శంకర్ దారిలో అట్లీ..!

ఈ మధ్య కాలంలో స్టార్‌ దర్శకులు అంతా కూడా సొంత నిర్మాణ సంస్థలను మొదలు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 April 2024 6:20 AM GMT
సుకుమార్‌, శంకర్ దారిలో అట్లీ..!
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ దర్శకులు అంతా కూడా సొంత నిర్మాణ సంస్థలను మొదలు పెడుతున్నారు. సుకుమార్‌ ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో పలు సినిమాలను నిర్మించి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. తన బ్యానర్‌ తో పలువురు దర్శకులను ఆయన పరిచయం చేసిన విషయం తెల్సిందే.

దర్శకుడు శంకర్ తో పాటు త్రివిక్రమ్‌ ఇంకా చాలా మంది దర్శకులు కూడా తమ సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ బ్యానర్‌ లో సొంత సినిమాల కంటే చిన్న సినిమాలనే ఎక్కువగా నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అట్లీ కూడా ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు.

జవాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అట్లీ త్వరలో అల్లు అర్జున్ తో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ లోపు విజయ్ సేతుపతి హీరోగా అట్లీ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతోంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

అట్లీ తన శిష్యుడు అయిన బాలాజీ ధరణీ ధరన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో రూపొందబోతుంది. స్క్రిప్ట్‌ విషయంలో అట్లీ తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. మరి అట్లీ దర్శకుడిగా హిట్‌ అయ్యేనా చూడాలి.