Begin typing your search above and press return to search.

అట్లీ.. ఈసారి 2000 కోట్లు అందుకుంటాడేమో

ప్రస్తుతం అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 4:58 AM GMT
అట్లీ.. ఈసారి 2000 కోట్లు అందుకుంటాడేమో
X

కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అట్లీ గత ఏడాది జవాన్ మూవీతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీ వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. గత ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా జవాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ తమిళ్ డైరెక్టర్ గా కూడా అట్లీ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని అల్లు అర్జున్ అట్లీతో సినిమాకి ఒకే చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ అట్లీ స్టైల్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

మళ్ళీ షారుఖ్ ఖాన్ తో సినిమా ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రశ్నకి అట్లీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. షారుఖ్ ఖాన్ గారు ఒకే అంటే తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే జవాన్ సీక్వెల్ చేసే ఆలోచన ఉందని కూడా స్పష్టం చేశాడు. జవాన్ సీక్వెల్ చేస్తే మొదటి సినిమా కంటే బెస్ట్ అవుతుందని అనిపించే సబ్జెక్టు సిద్ధం అయితే షారుఖ్ ఖాన్ ని నేరేట్ చేస్తానని చెప్పారు.

కచ్చితంగా భవిష్యత్తులో షారుఖ్ ఖాన్ తో మళ్ళీ మూవీ ఉంటుందని మాత్రం అట్లీ స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ తో సినిమా కంప్లీట్ అయ్యాక షారుఖ్ ఖాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జవాన్ సీక్వెల్ ని అట్లీ సిద్ధం చేసే అవకాశం ఉందంట. మొదటి సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఈ సారి జవాన్ సీక్వెల్ చేస్తే కచ్చితంగా 2000 కోట్లపై అట్లీ ఫోకస్ చేసే ఛాన్స్ ఉందని సౌత్ సర్కిల్ లో వినిపిస్తోంది.

సౌత్ స్టైల్ యాక్షన్, కమర్షియల్ కథలని నార్త్ ఇండియాలో డిమాండ్ బాగా పెరిగింది. బాహుబలి సిరీస్ ప్యూర్ కమర్షియల్ యాక్షన్ మూవీగానే రాజమౌళి తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సిరీస్ లు యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందుకే బాలీవుడ్ స్టార్స్ కూడా మసాలా కథలతో సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అట్లీ బాలీవుడ్ హీరోలకి జవాన్ మూవీతో ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడని చెప్పొచ్చు.